Tuesday, 9 October 2018

నేనొక కవిని - కవిత

నేనొక కవిని
నిరంతరం జ్వలించే రవిని
సృజనాత్మకతకై తపించే జీవిని
రుచికర లేత చిగురుమావిని
సదా ఆలోచనల ఊట ఊరే ఊటబావిని
రణగొణ ధ్వనుల ప్రపంచంలో వినూత్న శబ్దాలకై రిక్కించి వినే చెవిని
కవిత్వమనే మహా సముద్రంలో చిన్న నీటి బిందువుని
కవిత్వమనే విశాల ఎడారిలో చిరు ఇసుక రేణువుని
విశాల వృక్ష సామ్రాజ్యంలో ఔషధ వృక్షం రావిని
కవిత్వ ప్రపంచంలో బుడి బుడి నడకలు వేస్తున్న బుజ్జాయిని
సకల దేవతలు వసించే దివిని
సకల ప్రాణికోటి వసించే భువిని
నేనొక కవిని


No comments:

Post a Comment