నాగిరెడ్డిపేట మండలంలోని పెద్ద ఆత్మకూరు గ్రామంలో శ్రీ మరకత ఆత్మ లింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం గ్రామస్తులు భక్తులు ఘనంగా జరుపుకున్నారు లోక కళ్యాణార్థమై పెద్ద ఆత్మకూరు గ్రామంలో సుందరమైన శివ దేవాలయాన్ని నిర్మించుకొని వైభవంగా త్రయాహిన్యక విధానంలో శ్రీ శ్రీ మరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవము మొదటిరోజు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గణపతి పూజ పుణ్యహవాచనము అఖండ దీప స్థాపన రక్షాబంధనం రోగిని వాస్తు క్షేత్రపాలక నవగ్రహ సర్వతోభద్ర మండల దేవత ఆవాసము అగ్ని ప్రతిష్ట గణపతి భవనము బింబ సంస్కారం ప్రతిమ శోధన అగ్ని అవతారం జలాధివాసం తీర్థ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు మొదటి రోజు నిర్వహించడం జరిగిందని గ్రామస్తులు మరియు మాజీ సర్పంచ్ గడ్డం బాల్రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్రి అన్నగ లక్ష్మీ, మాజీ సర్పంచ్ గడ్డం బాల్రెడ్డి గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి