సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని కేశవాపూర్ గ్రామ ఈశన్య దిశలో ఉన్న గుట్టల ప్రాంతంలో సుమారు 150 ఏళ్ల క్రితం వెంకటేశ్వర స్వామి స్వయంభూవుగా వెలిశారు ఒకరోజు అకస్మాత్తుగా గుట్ట చీలిపోయి అందులో చిన్న గుహ ఏర్పడింది ఆ గుహలో నుంచి వినిపించిన ఘంటానాదం స్వయంగా వెలిగిన దీపజ్యోతి ఈ దృశ్యాలు గ్రామ ప్రజలలో భక్తి జ్యోతిని రగిలించాయి ఆ గుహలో వెలిసిన నిరాకార స్వరూపాన్ని స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామిగా కొలవడం ప్రారంభించారు అప్పటినుంచి ఈ క్షేత్రం కొత్త దేవుడిగా ప్రసిద్ధి చెందింది ఏటా శ్రవణ మాసంలో కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో పెద్దలతో కలిసి భక్తులు వనభోజనాలు చేస్తారు ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులు ఇక్కడ నిర్వహించే వనభోజనాలు ప్రత్యేక పూజలు ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తున్నాయి భక్తులు ముడుపులు కడుతూ తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు ఈ గుహకు తూర్పు దిశలో ఉన్న నల్ల పోచమ్మ ఆలయం ఈ ప్రాంతానికి మరో ఆధ్యాత్మికత పరిమళాన్ని జోడిస్తోంది గుహ సమీపంలో విరాజిల్లే భారీ మర్రిచెట్టు దాని నీడలో కూర్చుని జపమాలలు తిప్పే భక్తులు గాలిలో తేలే మంత్రం ఈ దృశ్యాలు ఈ క్షేత్రాన్ని ఒక జీవంత ఆధ్యాత్మిక ప్రపంచంగా నిలబెడుతున్నాయి. ఇంతటి ఆధ్యాత్మిక విశిష్టత ఉన్నప్పటికీ ఈ క్షేత్రం ఇప్పటికీ నిరాదరణలోనే ఉంది ఆలయ నిర్మాణం లేకపోవడం రహదారి సౌకర్యాలు పరిమితంగా ఉండడం తాగునీరు విద్యుత్ వంటి కనీస వసతులు లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఒక చారిత్రక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆలయ నిర్మాణం రహదారులు తాగునీరు విద్యుత్తు విశ్రాంతి గృహాలు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి