ఇకపై యాదగిరిగుట్టలో ప్రతిరోజు గిరిప్రదక్షిణ నిర్వహణకు కొండ క్రింద వైకుంఠ ద్వారం దగ్గర కృష్ణ శిలతో తయారుచేసిన స్వామి వారి పాదాలు ప్రతిష్టించి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించ, ఆలయ ఈవో భవాని శంకర్తో కలిసి ప్రారంభించారు. రోజు ఉదయం 5:30 కు ప్రత్యేక పూజలు అనంతరం గిరి ప్రదక్షిణ ప్రారంభం అవుతుందని భక్తులు ఏ సమయంలోనైనా పాల్గొనవచ్చని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు స్వామి వారి జన్మ నక్షత్రమైన "స్వాతి "రోజున మాత్రమే గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి