గంభీరావు పేట లోని సీతారామ సమి గుడిలో అఖండ నందదీపం.
పై చిత్రంలోని దీపం సాధారణమైనది కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానం లోని అఖండ నందా దీపం ఇది. ఈ దీపం ఏకంగా 700 ఏళ్లుగా కొండేక్కలేదు అంటే ఆరిపోలేదు. అవును నిరంతరాయంగా వెలుగుతూనే ఉండడం విశేషం. కాకతీయుల చివరి రాజైన ప్రతాపరుద్రుడు పాలనలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు పూర్వికులు చెబుతుంటారు. ఆలయంలో మూల విగ్రహ ప్రతిష్టకు ముందు ఈ అఖండనందా దీపాన్ని వెలిగించారు. నాటి నుంచి నేటి వరకు ఆ దీపం కొండెక్కకుండా ఆలయ నిర్వాహకులు, భక్తులు తరతరాలుగా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. అఖండ జ్యోతి వెలిగితేనే తమ గ్రామం సిరి సంపదలతో తుల తూగుతుందని గంభీరావుపేట ప్రజల విశ్వాసం. ఈ సీతారామాలయం 1333వ సంవత్సరంలో నిర్మించినట్లు ఆలయంలోని గంటపై చెక్కిన తెలుగు అంకెల ఆధారంగా తెలుస్తోంది .ఇక ఆలయంలో 16 స్తంభాలతో నిర్మించిన కళ్యాణ మండపం /రాతి నిర్మాణం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఏటా శ్రీరామనవమి సందర్భముగా ఈ మండపంలోనే సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ వేడుకను, అఖండ దీపాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి