వినాయక చవితి పండుగ ఇంకా రాకమునుపే రకరకాల గణపయ్య ప్రతిమలు భక్తులను ఎంతో అలరిస్తున్నాయి. తిరుపతి నుండి కరకంబాడి కి వెళ్లే మార్గంలోని బొమ్మల క్వార్టర్స్ వద్ద 46 కిలోల, సుమారు 1,80,000 వక్కలతో ఏడడుగుల పర్యావరణహిత విగ్రహం ముస్తాబయింది. దీనిని కళాకారుడు రాము కుటుంబ సభ్యులతో కలిసి సిద్ధం చేశారు. నిమజ్జనం చేసే సమయంలో పర్యావరణం కలుషితం కావద్దనే ఉద్దేశంతో తిరుపతికి చెందిన పలువురు భక్తులు ప్రత్యేకంగా తయారు చేయించినట్లు ఆయన పేర్కొన్నారు .ఇందుకోసం కడప నుంచి వెడల్పు ఎక్కువగా ఉన్న వక్కలు తెప్పించామని చెప్పారు. విగ్రహం తయారీకి 15 రోజులు పట్టిందని , ఒక లక్ష పదివేల రూపాయల ఖర్చు అయిందని రాము వివరించారు .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి