8, సెప్టెంబర్ 2026, మంగళవారం

వారం వర్జ్యం 9-9-2026

 త్రయోదశి ..

బుధవారం, సూర్యోదయం.. 6.07 నిమిషాలు, సూర్యాస్తమయం.. 6 20 నిమిషాలు,

 శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం ,వర్ష రుతువు,

 శ్రావణమాసం, కృష్ణపక్షం, త్రయోదశి ..పగలు 11 59 నిమిషాలు,

 తదుపరి చతుర్దశి.. ఆశ్లేష.. పగలు .మూడు గంటల 48 నిమిషాలు ,వర్జ్యం లేదు, రాహుకాలం ..పగలు 12 నుండి 1:30 వరకు ,

యమగండకాలం ..ఉదయం ఏడు గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు,

 దుర్మూర్తం ..పగలు 11:49 నుండి 12. 37 వరకు

7, సెప్టెంబర్ 2026, సోమవారం

వనితలకు రూ 5 కే ఆటో

 తిరుపతి జిల్లా తిరుచానూరుకు చెందిన యువకుడు అజిత్ కుమార్ . ఇంటర్ వరకు చదివి ఆటో నడుపుతున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారు వెలసిన ప్రాంతంలో ఉంటున్నందున అమ్మవారి దర్శనార్థం వచ్చే మహిళలకు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ,రైల్వే స్టేషన్ వరకు ప్రయాణానికి ఐదు రూపాయల చొప్పున మాత్రమే తీసుకుంటున్నారు .

ఇతర ఆటోవాలా లు 30 నుంచి 50 రూపాయల వరకు వసూలు చేస్తారని బస్సు చార్జీ 20 రూపాయలు ఉంటుందని అజిత్ తెలిపారు. నాలుగు నెలల క్రితం ఆటో నడపడం ప్రారంభించామని ,అప్పటి నుంచి ఇదే నిర్ణయానికి కట్టుబడ్డానని అజిత్ వివరించారు. తమిళనాడు సీఎం విజయ్ అభిమానిని అని అందుకే ఆటోకు ఆయన చిత్రాలు వేసుకున్నట్లు పేర్కొన్నారు.