Wednesday, 31 January 2024

మూడు నుంచి తిరుమలలో ధార్మిక సదస్సు

 మూడు నుంచి తిరుమలలో ధార్మిక సదస్సు

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో భక్తుల్లో ఆధ్యాత్మిక భావవ్యప్తి కోసమే తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు నిర్వహించనున్నట్లు టిటిడి ధర్మకర్తల మండల అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు ధార్మిక సదస్సు ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మరింతగా హైందవ ధర్మాన్ని శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు చిన్న వయసు నుంచే చిన్నారుల్లో మానవతా విలువలను పెంచేందుకు టీటీడీ అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు దీనిలో భాగంగా ధార్మిక సదస్సు నిర్వహించి పీఠాధిపతులు మఠాధిపతుల సూచనలను స్వీకరించి మరింతగా ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు ఇప్పటివరకు 57 మంది పీఠాధిపతులు సదస్సుకు వచ్చేందుకు సమ్మతించినట్లు చెప్పారు శ్రీవారి ఆలయం నుంచి ఏ సందేశం వెళ్లిన భక్తులందరూ ఆమోదించి ఆచరిస్తారని చైర్మన్ తెలిపారు.





మహానుభావుడు పరిషత్ బైక్ ర్యాలీకి ఘన స్వాగతం

 అఖిల భారతీయ మహానుభావు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మహంతి మచ్చాలే బాబా మహారాష్ట్ర బైక్ ర్యాలీకి బుధవారం స్థానిక భక్తులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం కామారెడ్డి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి శ్రీకృష్ణ ధ్యాన మందిరం కు వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో మహానుభావుడు పరిషత్ ప్రతినిధులు జయసాయి దేవ్ శ్యాంశాస్త్రి రమేష్ శాస్త్రి దినేష్ దాదా అమృత శాస్త్రి ధర్మరాజు కిరణ్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు



సరస్వతి దేవి మాల ధారణ కరపత్రాలు ఆవిష్కరణ

 బాన్స్వాడలోని సరస్వతి దేవి మాల ధారణ కరపత్రాలను బుధవారం సరస్వతి ఆలయంలో ఆలయ ధర్మకర్త శంభు రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞాన సరస్వతి దేవి 34వ దీక్ష స్వాములు మాల ధారణకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించినట్లు తెలిపారు వసంత పంచమి పురస్కరించుకొని మాల విరమణ ఉంటుందని అన్నారు సరస్వతి ఆలయం వద్ద మండల పూజ మహోత్సవం నిర్వహించనున్నట్టు తెలిపారు ఆలయ అర్చకులు సంతోష్ శర్మ దీక్ష స్వాములు విజయ్ తుకారం రితేష్ బసంత్ శ్రీనివాస్ గౌడ్ ప్రశాంత్ గౌడ్ అరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



ఆలయానికి విరాళాల అందజేత

 పోతు రెడ్డి పల్లి హనుమాన్ ఆలయానికి భూదానం కోసం బుధవారం భక్తులు నగదు విరాళాలను అందజేశారు నిజాంసాగర్ మండలంలోని గోర్కల్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు దుర్గారెడ్డి 5000 పిట్లం మండలంలోని బుర్నాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి 5000 రూపాయలు బంకుల లక్ష్మారెడ్డి ఐదువేల రూపాయలు ముడుకున్చల్ కు చెందిన ప్రతాపరెడ్డి 5000 రూపాయలు తడకలకు చెందిన గోపాల్ చారి 6000 ఆలయ భూదానం కోసం ఆలయ నిర్వహణ తేజస్వామికి అందజేశారు



16న తిరుమలలో రథసప్తమి వేడుకలు

 రథసప్తమి వేడుకలను తిరుమలలో ఫిబ్రవరి 16వ తేదీన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారు ఏడు వాహనాలపై భక్తులకు మాడవీధుల్లో దర్శనమిస్తారు




హనుమాన్ చాలీసా పారాయణం

 ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో హనుమాన్ మందిరంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు కాలనీవాసులు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి జై హనుమాన్ అని నినాదాలు చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ కుమార్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ నరసయ్య భూమయ్య శంకర్ ఎల్టి కుమార్ సాయన్న జీవన్ ముత్యాల రవి సాయిలు నారాయణ తదితరులు పాల్గొన్నారు



పళనిలో అన్యమతస్తుల ప్రవేశం నిషిద్ధం

 తమిళనాడులోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం పలని దండాయిదపాని ఆలయంలో హిందువులు మినహా అన్య మతస్తులు ధ్వజస్తంభాన్ని దాటి లోపలికి వెళ్లేందుకు అనుమతించకూడదని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఉత్తరం జారీ చేసింది ఇటీవల ఆలయంలో అన్య మతస్తులు ఆలయంలో ప్రవేశించడానికి అనుమతి లేదు అనే ప్రకటన బోర్డును ఆలయ నిర్వహణ తొలగించారు దీన్ని వ్యతిరేకిస్తూ తలానికి చెందిన సెంథిల్ కుమార్ హైకోర్టుకు వెళ్లారు హిందూ దేవాలయ ఆలయ ప్రవేశ చట్టం 1947 ప్రకారం హిందువుల ఆలయాల్లో అన్యమతస్తుల ప్రవేశానికి తావు లేదని బోర్డును తొలగించడం వల్ల ఇతర మతస్తులు ఆలయంలో ప్రవేశించవచ్చునని అపోహ ప్రజల్లో కలిగే అవకాశం ఉందని వాదించారు ఆయన వాదనతో కోర్టు ఏకీభవించింది.



శివ స్వాములకు బిక్ష

 కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి శివాలయంలో శివ స్వాములకు మహారాజ పోషకుడు లోకోటి బాపూరావు దంపతుల ఆధ్వర్యంలో భిక్ష ఏర్పాటు చేశారు ఆలయంలో అర్చకులు, శశికాంత్ శర్మ శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో అర్చనలు అభిషేకాలు చేశారు కార్యక్రమంలో శివబిక్ష కమిటీ అధ్యక్షుడు నిట్టు నారాయణరావు వైఎస్ ఎంపిపి ఉరుదొండ నరేష్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



కాలభైరవుడికి సింధూర పూజలు

 



రామారెడ్డి మండలంలోని కాలభైరవుడి ఆలయంలో మంగళవారం మూలవిరాట్ కాలభైరవుడికి జలాభిషేకం సింధూర పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు నిర్వాహకులు అన్నదానం చేశారు ఆల ఏవో బూర్ల ప్రభువు గుప్తా ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ వంశీకృష్ణ శర్మ జూనియర్ అసిస్టెంట్ సురేందర్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు



ఆలయానికి స్థలం విరాళం

 బాన్సువాడ మండలంలోని హనుమాజీపేట గ్రామంలో రుక్మిణి విఠలేశ్వర మందిర నిర్మాణానికి పలువురు గ్రామస్తులు 120 గజాల స్థలాన్ని నిరాళంగా అందించినట్లు సర్పంచ్ బోనాల సుభాష్ తెలిపారు గ్రామానికి చెందిన కమల్ గారి పరివారానికి చెందిన లక్ష్మణ్ రంజిత్ రామ్ పటేల్ తమ సొంత స్థలాన్ని విరాళంగా అందించారని తెలిపారు.



నదీ తీరం జనహారం

 తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని పెన్ గంగా తీరం జనహారాన్ని తలపిస్తోంది పెనుగంగా జాతరలో భాగంగా మహారాష్ట్రతో పాటు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ బేల మండలాల్లోని చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు నదికి ఇరువైపులా ఇటు తెలంగాణ అట మహారాష్ట్ర పుణ్యస్నానాలు ఆచరించి నదీమ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు నైవేద్యాలు సమర్పించి ముగ్గురు తీర్చుకున్నారు దీంతో ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన దల్లారా వద్ద నది తీరం ఎటు చూసినా ఇలా భక్తజన సందడిగా దర్శనమిచ్చింది.



Tuesday, 30 January 2024

శ్రీ సీతారామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు

 బాన్సువాడ పట్టణంలోని శ్రీరామ కాలనీలో గల శ్రీరామ ఆలయంలో అర్చకులు మధుసూదన శర్మ శ్రీ సీతారామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం స్వామివారికి అభిషేకాలు అర్చనలు చేపట్టారు భక్తులు సమర్పించిన నూతన వస్త్రాలతో అలంకరించారు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులున్నార

దోమకొండ లో సంకష్టహర చతుర్థి పూజలు

 దోమకొండ మండల కేంద్రంలోని శ్రీ చాముండేశ్వరి మాత దేవాలయంలో సోమవారం సంకష్టహర చతుర్థి సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వినాయకుడికి పూలతో అందంగా అలంకరించారు అనంతరం భక్తులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం శావతీశారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలకుర్తి శేఖర్ తో పాటు కమిటీ సభ్యులు పూజారి బావి శరత్చంద్ర శర్మ మరియు భక్తులు పాల్గొన్నారు.

బాసర మీదుగా అయోధ్యకు ప్రత్యేక రైలు

 మహారాష్ట్రలోని జాల్నా జంక్షన్ నుంచి బాసర మీదుగా అయోధ్యకు వచ్చే నెల నాలుగున ప్రత్యేక రైలు నెంబర్ 07.6 49 ను ఏర్పాటు చేశారు ఈ రైలు జాల్న ఫర్గూర్ శైలు పర్భని పూర్ణ నాందేడ్ ముదిఖేడ్ ఉమ్రి బాసర నిజామాబాద్ ఆర్మూర్ కోరుట్ల లింగంపేట్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి మీదుగా అయోధ్యకు చేరుకుంటుందని బాసర రైల్వే అధికారులు తెలిపారు నాలుగున ఉదయం 9:30 గంటలకు జాల్నా నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:15 గంటలకు బాసర మీదుగా మరుసటి రోజు ఎక్కువ జామున 3 35 గంటలకు అయోధ్యకు చేరుకుంటుందని అన్నారు అలాగే 7న అయోధ్య నుంచి మధ్యాహ్నం రెండు గంటల 45 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11:53 గంటలకు బాసర మీదుగా జాల్న చేరుకుంటుందని తెలిపారు ఈ రైలులో 20 సాధారణ బోగీలు రెండు ప్రత్యేక భోగీలు ఏర్పాటు చేశారు




ఆలయ కమిటీకి విరాళం

 పాత బాన్సువాడ లోని ప్రసిద్ధి వినాయక మందిరంలో అర్చకుడి వేతనానికి పట్టణానికి చెందిన వ్యాపారవేత్త నటరాజ్ సోమవారం 400 రూపాయల విరాళం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు సభ్యులు గంగారాం గోపాల్ తదితరులు ఉన్నారు.



ధ్యానం అలవాటు చేసుకోవాలి

 మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు భగవంతుడిని ధ్యానించడం అలవాటు చేసుకోవాలని అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుందని సంస్థాన్ హల్దీపుర వైశ్యకుల గురువు మఠాధిపతి పరమ పూజ శ్రీ వామనాశ్రమ మహా స్వామీజీ అన్నారు సోమవారం బీబీపేట మండల కేంద్రంలోని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దివ్యామృత ప్రవచనాల కార్యక్రమానికి హాజరైన ఆయన భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు మంచి విషయాలు తెలుసుకుంటూ మంచి పనులు చేస్తూ ఉంటే సంతోషంతో ఉంటామని మనకు భగవాన్ నామ స్మరణం అవసరమని అన్నారు ఇతరులకు కీడు తలపెట్టకుండా ఎదుటి వారికి ఎల్లప్పుడూ తోడ్పడాలన్నారు కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు మహిళలు పాల్గొన్నారు






భద్రాద్రి రాముడు కల్యాణానికి అక్షింతలు

 భద్రాచల రాముడి కళ్యాణానికి వినియోగించే అక్షింతలను ఎల్లారెడ్డి నుంచి మహిళలు పంపారు సోమవారం పట్టణంలోని విఠలేశ్వర ఆలయంలో శ్రీరాముడి కళ్యాణానికి వినియోగించే తలంబ్రాల కోసం వడ్లకు ప్రత్యేకంగా పూజలు చేశారు అనంతరం వడ్లను ఒ లిచి తలంబ్రాలను తయారు చేశారు




అర్థ మండల దీక్ష ప్రారంభం

 బాన్సువాడ మండలంలోని తాడ్కూర్ భక్త మార్కండేయ మందిరంలో సోమవారం అర్ధమండల దీక్షలు ప్రారంభమయ్యాయి పలువురు భక్తులు మాల వేసుకుని ప్రత్యేక పూజలు చేశారు కొన్నేళ్లుగా గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ చిరంజీవి మహేష్ విట్టల్ విష్ణువర్ధన్ వాసుదేవ్ ధీరజ్ తదితరులు పాల్గొన్నారు



రాజన్న క్షేత్రం భక్త జన సంద్రం..

 మేడారం జాతర సమీపిస్తున్నందున వేములవాడ రాజన్న క్షేత్రం సోమవారం భక్తజనసంద్రమైనది ఉదయాన్నే ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కోడి మొక్కు తీర్చుకొని స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి బారులు తీరారు సాయంత్రం 6 గంటల వరకే సుమారు 80000 కు పైగా భక్తులు దర్శించుకున్నారని వివిధ ఆర్జిత సేవల ద్వారా రాజన్నకు సుమారు 36 లక్షల రూపాయల ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు డిఎస్పి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో పట్టణ సీఐ కరుణాకర్ బందోబస్తును ఏర్పాటు చేశారు





వేములవాడకు పోటెత్తిన భక్తులు దర్శనానికి 5 గంటల సమయం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి సమ్మక్క జాతర భక్తుల తాకిడి పెరిగింది సోమవారం 50 వేలకు పైగా భక్తులు తరలివచ్చారు ధర్మగుండంలో స్నానాలు చేసి కోడిమొక్కులు చెల్లించుకున్నారు భక్తుల రద్దీ పెరిగిపోవడంతో ఆలయ అధికారులు ఆర్జిత సేవలను రద్దుచేసి సోమవారం అర్ధరాత్రి వరకు దర్శనాలకు అవకాశం ఇచ్చారు దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పట్టింది వీఐపీల తాకిడి పెరిగిపోవడంతో పిఆర్ఓ కార్యాలయాన్ని అధికారులు మూసివేశారు ఆలయానికి రూపాయలు 60 లక్షల వరకు ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.






శ్రీ వారి బంగారం తో మంగళ సూత్రాలు..

 తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది వెంకటేశ్వర స్వామికి కానుకల రూపంలో వస్తున్న కిలోల కొద్దీ బంగారాన్ని మరో రూపంలో భక్తులకు అందే విధంగా ప్రణాళికను సిద్ధం చేసింది టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి నేతృత్వంలో సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించిన బంగారంతో వివిధ ఆచారాలు అనుసరించి ధరించే మంగళసూత్రాలు తయారు చేయించాలని ధర్మకర్తల మండలి తీర్మానించింది ఈ రకంగా తయారుచేసిన తాళిబొట్లను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ఉంచి పూజలు చేసి లాభాపేక్ష లేని ధరను నిర్ణయించి విక్రయిస్తారు నాలుగైదు డిజైన్లలో తయారుచేసి ఈ మంగళ సూత్రాలు ఐదు గ్రాములు 10 గ్రాముల బరువుతో ఉంటాయి.





నర్సన్న హుండీ ఆదాయం 2.32 కోట్లు

 యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీలను సోమవారం ఆలయ అధికారులు లెక్కించార. 25 రోజులుగా హుండీలో భక్తులు సమర్పించిన నగదు బంగారం వెండిని ఎస్పీఎఫ్ హోంగార్డుల భద్రత నడుమ కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రత మండపానికి తరలించి లెక్కించారు ఇందులో రెండు కోట్ల 32 లక్షల 22 వేల 689 నగదు రాగా 230 గ్రాముల బంగారం నాలుగు కిలోల 420 గ్రాముల వెండి వచ్చిందని ఈవో రామకృష్ణారావు చెప్పారు అలాగే 593 యూఎస్ డాలర్లు 65 యూఏఈ గ్రహమ్స్ 65 ఆస్ట్రేలియన్ 220 కెనడా 10 సింగపూర్ డాలర్లు 10 ఇంగ్లాండు పౌండ్స్ 122 సౌదీ అరేబియా 400 ఒమన్ రియాల్స్ 15 యూరోస్తోపాటు మరికొన్ని దేశాల కరెన్సీ వచ్చిందని ఈవో చెప్పారు చైర్మన్ నరసింహమూర్తి పర్యవేక్షించారు.




కొండ గట్టు అంజన్న ఆదాయం రెండింతలు

 కొండగట్టు అంజన్న ఆలయ ఆదాయం భారీగా పెరిగింది ఆలయ ప్రాంగణంలోని షాపులకు అధికారులు సోమవారం వేలంపాట నిర్వహించగా నిర్వాహకులు పోటీపడ్డారు ప్రధానంగా కొబ్బరికాయల విక్రయం కొబ్బరి చిప్పల సేకరణ టెండర్లకు తీవ్ర పోటీ నెలకొంది గత ఏడాది వేలంపాట ద్వారా రూపాయలు రెండు కోట్ల 64 లక్షల ఆదాయం రాగా ఈసారి మూడు కోట్ల 75 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది టెండర్ను 45 లక్షలకు దక్కించుకోగా ఈసారి 80 లక్షలకు దక్కించుకున్నారు 94 లక్షలు గా ఉన్న కొబ్బరికాయల షాపు టెండర్ ఈసారి ఒక కోటి 37 లక్షలకు చేరింది వీటితోపాటు కిరాణా పూలు పండ్లు కూల్డ్రింక్స్ హోటళ్లను గతంలో కంటే రెండింతలు పెట్టి దక్కించుకున్నారు వేలంపాటలో అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ ఈవో వెంకటేష్ ఏఈఓ బుద్ధి శ్రీనివాస్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ శర్మ పాల్గొన్నారు.




సిద్ధుల గుట్ట పై ప్రత్యేక పూజలు, అన్నదానం

 ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ నవనాథ సిద్దుల గుట్టను సోమవారం భక్తులు సందర్శించుకున్నారు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి  పొద్దుటూరి వినయ్ రెడ్డి హాజరై గుట్ట పైన ఉన్న శివాలయం రామాలయం అయ్యప్ప మందిరాల్లో ప్రత్యేక పూజలు చేశారు ఉత్సవమూర్తులకు రామాలయం నుంచి జీవకోనేరు వరకు పల్లకి సేవ నిర్వహించారు అనంతరం మూల లక్ష్మి ఎర్రన్న ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో నిజాంసాగర్ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ ఎలా సాయి రెడ్డి కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ సాయి బాబా గౌడ్ ఫతేపూర్ శ్రావణ్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ విఠం జీవన్ పూల నరసయ్య కొంత మురళీధర్ తదితరులు పాల్గొన్నారు