మేడారం జాతర సమీపిస్తున్నందున వేములవాడ రాజన్న క్షేత్రం సోమవారం భక్తజనసంద్రమైనది ఉదయాన్నే ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కోడి మొక్కు తీర్చుకొని స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి బారులు తీరారు సాయంత్రం 6 గంటల వరకే సుమారు 80000 కు పైగా భక్తులు దర్శించుకున్నారని వివిధ ఆర్జిత సేవల ద్వారా రాజన్నకు సుమారు 36 లక్షల రూపాయల ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు డిఎస్పి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో పట్టణ సీఐ కరుణాకర్ బందోబస్తును ఏర్పాటు చేశారు
వేములవాడకు పోటెత్తిన భక్తులు దర్శనానికి 5 గంటల సమయం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి సమ్మక్క జాతర భక్తుల తాకిడి పెరిగింది సోమవారం 50 వేలకు పైగా భక్తులు తరలివచ్చారు ధర్మగుండంలో స్నానాలు చేసి కోడిమొక్కులు చెల్లించుకున్నారు భక్తుల రద్దీ పెరిగిపోవడంతో ఆలయ అధికారులు ఆర్జిత సేవలను రద్దుచేసి సోమవారం అర్ధరాత్రి వరకు దర్శనాలకు అవకాశం ఇచ్చారు దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పట్టింది వీఐపీల తాకిడి పెరిగిపోవడంతో పిఆర్ఓ కార్యాలయాన్ని అధికారులు మూసివేశారు ఆలయానికి రూపాయలు 60 లక్షల వరకు ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.
No comments:
Post a Comment