మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు భగవంతుడిని ధ్యానించడం అలవాటు చేసుకోవాలని అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుందని సంస్థాన్ హల్దీపుర వైశ్యకుల గురువు మఠాధిపతి పరమ పూజ శ్రీ వామనాశ్రమ మహా స్వామీజీ అన్నారు సోమవారం బీబీపేట మండల కేంద్రంలోని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దివ్యామృత ప్రవచనాల కార్యక్రమానికి హాజరైన ఆయన భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు మంచి విషయాలు తెలుసుకుంటూ మంచి పనులు చేస్తూ ఉంటే సంతోషంతో ఉంటామని మనకు భగవాన్ నామ స్మరణం అవసరమని అన్నారు ఇతరులకు కీడు తలపెట్టకుండా ఎదుటి వారికి ఎల్లప్పుడూ తోడ్పడాలన్నారు కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు మహిళలు పాల్గొన్నారు
No comments:
Post a Comment