Wednesday, 31 January 2024

సరస్వతి దేవి మాల ధారణ కరపత్రాలు ఆవిష్కరణ

 బాన్స్వాడలోని సరస్వతి దేవి మాల ధారణ కరపత్రాలను బుధవారం సరస్వతి ఆలయంలో ఆలయ ధర్మకర్త శంభు రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞాన సరస్వతి దేవి 34వ దీక్ష స్వాములు మాల ధారణకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించినట్లు తెలిపారు వసంత పంచమి పురస్కరించుకొని మాల విరమణ ఉంటుందని అన్నారు సరస్వతి ఆలయం వద్ద మండల పూజ మహోత్సవం నిర్వహించనున్నట్టు తెలిపారు ఆలయ అర్చకులు సంతోష్ శర్మ దీక్ష స్వాములు విజయ్ తుకారం రితేష్ బసంత్ శ్రీనివాస్ గౌడ్ ప్రశాంత్ గౌడ్ అరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



No comments:

Post a Comment