రావణుడు ,కుంభకర్ణుడు, మేఘనాథుడు దిష్టిబొమ్మలతో సహా అగ్నికి ఆహుతి.. ఢిల్లీ రాంలీల ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణ.. స్వచ్ఛభారత్ సందేశమే లక్ష్యం అంటున్న నిర్వాహకులు ..
ఢిల్లీలోని రామ్ లీలా ఉత్సవంలో భాగంగా ఈ ఏడాది నిర్వహించే దసరా వేడుకలలో ఒక ప్రత్యేక ఆకర్షణ చోటు చేసుకోనున్నది. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడు దిష్టిబొమ్మలతో పాటు 30 అడుగుల ఎత్తైన భారీ బొద్దింక దిష్టిబొమ్మను కూడా దహనం చేయనున్నారు. బొద్దింకలను అపరిశుభ్రతకు చిహ్నంగా భావించి ప్రజలకు పరిశుభ్రత పై అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీ కేశవ రామ్ లీలా కమిటీ నిర్వాహకులు శుక్రవారం తెలిపారు . ఢిల్లీలోని పీతాం పురలో ఏటా రామ్ లీలా ఉత్సవాల నిర్వహించే శ్రీ కేశవ రామ్ లీలా కమిటీ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. స్వచ్ఛభారత్ ,స్వచ్ఛ ఢిల్లీ కార్యక్రమాలకు మద్దతుగా ఈ ప్రత్యేక దిష్టిబొమ్మలు ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ వెల్లడించింది. చెడుపై మంచిని సాధించే విజయానికి ప్రతీకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రావణుడి సైన్యంలోని అసురుల సరసన బొద్దింకను కూడా చేర్చి దహనం చేయనున్నట్లు పేర్కొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి