10, సెప్టెంబర్ 2026, గురువారం

తిరుమల వచ్చే ప్రతి భక్తుడికి బీమా

 సహజ మరణాలకు రెండు లక్షల రూపాయలు ప్రమాదం అయితే పది లక్షలు టిటిడి చైర్మన్ డిఆర్ నాయుడు ప్రకటన 

తిరుమల కొండ ఎక్కే ప్రతి భక్తుడికి బీమా సదుపాయం కల్పించనున్నట్లు టిటిడి చైర్మన్ బీ ఆర్ నాయుడు ప్రకటించారు. అలిపిరి దాటినప్పటి నుంచి భక్తులందరికీ ఈ గ్రూప్ పాలసీ వర్తిస్తుందని తెలిపారు .తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈవో రవిచంద్ర, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి బోర్డు సభ్యులతో కలిసి చైర్మన్ మీడియాకు వివరించారు. కొండపై సహజ మరణం పొందిన భక్తుడు కుటుంబానికి రెండు లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్పారు .ఈ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ఆలయాల పరిధిలో టిటిడి ప్రవేశపెడుతోంది అని  పేర్కొన్నారు. ప్రమాదాలలో మరణించిన భక్తులకు మూడు లక్షలు గా ఉన్న భీమాను 10 లక్షల రూపాయలకు పెంచామని దీనికి 17 లక్షల రూపాయల ప్రీమియం ఖర్చును టీటీడీ భరిస్తుందని వెల్లడించారు. ఇందుకోసం ఎల్ఐసి తో ఒప్పందం చేసుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపిందని చెప్పారు.

ఆధ్యాత్మిక సమాచారం 10-9-2026

 మల్లికార్జున హుండీ లెక్కింపు ..

బీరంగూడ గుట్టపై కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో 200 రోజుల హుండీ లెక్కింపు నిర్వహించారు .హుండీ ద్వారా మొత్తం 13 లక్షల  రూపాయలకు పైగా ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు .సంగారెడ్డి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు సమక్షంలో హుండీ లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఆలయ ఈవో దేవనాథం, చైర్మన్ సుధాకర్ యాదవ్ పర్యవేక్షణలో భక్తుల సహకారంతో లెక్కింపు నిర్వహించారు .ఈ సందర్భంగా ఈవో దేవనాదం మాట్లాడుతూ హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు భక్తుల సహకారం ఎంతో అవసరమని అన్నారు .అనంతరం చైర్మన్ మాట్లాడుతూ హుంలెక్కింపుకు సహకరించిన భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిటీ సభ్యులు సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జు,న్ ప్రధాన అర్చకులు ప్రహ్లాద్, అధికారులు, మహిళా భక్తులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


నడకదారి భక్తులకు రక్షణగా పైకప్పు.. యాదగిరిగుట్ట మెట్ల మార్గంలో నిర్మాణానికి భూమి పూజ.. 




సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట కొండపైకి కాలినడకన వెళ్లే భక్తులకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించే పైకప్పు నిర్మాణ పనులకు దేవస్థానం శ్రీకారం చుట్టింది. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని మెట్ల మార్గంలో సందర్శించే భక్తుల సౌకర్యం కోసం బుధవారం ఈ మేరకు శంకుస్థాపన చేశారు .పెన్సిల్ ఫ్యాబ్రిక్ స్ట్రక్చరల్ విధానంలో ఆధునిక సాంకేతికతతో ఈ పైకప్పును ఏర్పాటు చేయనున్నారు .28 వేల చదరపు అడుగుల ఈ నిర్మాణానికి ఒకటిన్నర కోట్లను హైదరాబాద్లోని మేస్సర్స్ అగర్వాల్ ఫౌండరీస్ చెందిన ప్రమోదగర్వాల్ విరాళంగా అందించనున్నారు .మెట్ల మార్గంలో రక్షణ కోసం సీసీ కెమెరాలు, లైటింగ్ తదితర ఏర్పాట్లకు మరో 25 లక్షల కూడా విరాళంగా ఇచ్చేందుకు ఆయన అంగీకరించారు. ఈ పైకప్పు నిర్మాణ పనులకు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కే మాధవాచార్యులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు .ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి జై భవాని శంకర్ ,అగర్వాల్ ఫౌండరీస్ వైస్ చైర్మన్ సుజయ్ పాల్గొన్నారు.