పాతికేళ్లుగా ఒకే ఉత్సవ మూర్తికి పూజలు..
రాజన్న సిరిసిల్ల జిల్లా శాంతినగర్ లో అంబా బాయి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 25 వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. గత 25 ఏళ్లుగా ఒకే ఉత్సవమూర్తికి పూజలు నిర్వహిస్తూ వస్తూ ఉండడం ఈ ఉత్సవాల ప్రత్యేకత గా నిలుస్తోంది. అమ్మ వారు ఎంతో మహిమాన్విత శక్తి కలిగిన తల్లిగా తమను కాపాడుతున్నారని శాంతి నగర్ వాసులు గాఢంగా విశ్వసిస్తున్నారు. వార్షికోత్సవాల లో భాగంగా బుధవారం ఐదవ రోజు అమ్మవారు గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆభరణాలతో పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకొనుట కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వ స్తున్నారు. ప్రత్యేక పూజలు, ప్రార్థనలతో పరిసర ప్రాంతము ఆధ్యాత్మికత శోభ సంతరించుకున్నది. పాతికేళ్లుగా ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొంటూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.