Friday, 31 August 2018

చెప్పుడు మాటలు చేటు ...- కవిత

చెప్పుడు మాటలు చేటు ...
మనసులో విషబీజాలు నాటు...
వింటే తప్పదు మనకు అగచాటు...
భజనపరుల మాటలు భంగపాటుకు చోటు...
కలిగించును మనకు వెన్నుపోటు...
సదా అప్రమత్తతకు కల్పించు చోటు ...
తప్పించును మనకు గ్రహపాటు ...
నిజాయితీకి వేయు పెద్ద సీటు...
అది నిన్ను కాపాడును పది కాలాల పాటు...

నాణ్యత...ఒక చిన్న పదం,పాటిస్తే ప్రమోదం లేకుంటే ప్రమాదం - కవిత

నాణ్యత...ఒక చిన్న పదం,పాటిస్తే ప్రమోదం లేకుంటే ప్రమాదం...
హెల్మెట్ ... ఒక చిన్న పదం, ధరిస్తే ప్రమోదం లేకుంటే ప్రమాదం...
అణువు...  ఒక చిన్నపదం,అనువుగా వడుకుంటే ప్రమోదం లేకుంటే సృష్టించును పెను ప్రమాదం...
బతుకు...ఒక చిన్న పదం,సక్రమంగా సాగిస్తే ప్రమోదం లేకుంటే ప్రమాదం...
బలం ...ఒక చిన్న పదం,కల్గించును ప్రమాదం లో ప్రమోదం,ప్రమోదం లో ప్రమాదం...
ప్రాణం...ఒక చిన్న పదం,తనువులో ఉంటే ప్రమోదం లేకుంటే ప్రమాదం...
విలువ...ఒక చిన్న పదం ,పెంచుకుంటే ప్రమోదం,తగ్గించుకుంటే ప్రమాదం...
శిక్షణ...ఒక చిన్న పదం, పొందితే తప్పించును పెను ప్రమాదం,కలిగించును ప్రమోదం...
వైఖరి...ఒక చిన్న పదం...సానుకూలమైతే ప్రమోదం,ప్రతికూలమైతే ప్రమాదం...

'అతి సర్వత్ర వర్జయేత్... - కవిత

'అతి సర్వత్ర వర్జయేత్...
అత్యాశ ఎల్లవేళలా కలిగించును నిరాశ...
అతి నష్టం కలిగించును మనసుకు ఎంతో కష్టం...
అతి లాభం కలిగించును ఎంతో గాభరా...
అతి వాగుడు  ఆడిస్తుంది ఎంతటివారినైనా చెడుగుడు...
అతి వినయం కలిగించును వినాశనం...
అతి ప్రేమ కలిగించును తప్పకుండా చెడుపు...
అతి వృష్టి చెల్లా చెదురు చేయును ఈ సృష్టిని...
అతి ఒత్తిడి చేయును జీవితాన్ని చిత్తడి చిత్తడి...
అతి క్రమశిక్షణ చేయును తనువు మనువుల భక్షణ...
అతివ్యామోహం కల్గించును తప్పకుండా అవమానం...

గల గలా పారే గంగమ్మ తల్లి.. - కవిత

గల గలా పారే గంగమ్మ తల్లి...
కురిపించు మా పై విరివిగా వరాల జల్లు ...
కళకళలాడించు మా పైరులను పచ్చదనంతో..
తరిమికొట్టు కరువు అనే రాక్షస బల్లి...
విరబూయించు మా మోములపై చిరునవ్వుల జాజిమల్లి...
భోళా శంకరుడి తలపై ధవళ వర్ణంతో నిర్మలంగా ఒదిగిన ఓ తల్లీ
ప్రణమిల్లుతాము నీ ముందు ముకుళిత హస్తాలతో మోకరిల్లి ...
సదా ప్రసరించు నీ చల్లని చూపు పండు వెన్నెల జాబిల్లి...
అమ్మా గంగమ్మ తల్లి...

Thursday, 30 August 2018

నమో శారద నమో శారద నమో శారదా మాతా - భజన

నమో శారద నమో శారద నమో శారదా మాతా 2

హే విద్యా బుద్ధి ప్రదాయిణీ మా వీణా పుస్తక ధారిణీ 2
భవ భంజని మనో రంజని సత్య సాయీశ్వరీ మాతా  " నమో"

సాయిరాం సాయిశ్యాం - భజన

సాయిరాం సాయిశ్యాం
నిన్ను చూడాలి ఒకసారి నిన్ను చూడాలి ఒకసారి 2

భక్తులకొరకూ షిర్డీ పురమున వెలసితివోయీ సాయి బాబా
నిన్నే నేనూ నమ్మితి సాయీ
నను కాపాడగ రావా   " సాయిరాం "

నీ నగు మోమూ చూచిన చాలూ
నీకు సాటీ ఎవ్వరు లేరు
సాయి సాయి షిర్డి సాయి
దర్శనమీయగ రావా   " సాయిరాం "

నిన్నే వేడితి నా మొర వినవా
నీవు గాక మాకెవరయ్యా
బాబా బాబా సాయి బాబా
పరుగు పరుగున రావా  " సాయిరాం "

హర హర మహదేవా - భజన

హర హర మహదేవా
నీరాజనమిదె గైకొను దేవా హర హర మహ దేవా 2

గంగా జలముల తోనూ దధిక్షీర ఘృతమ్ములతోనూ
అభిషేకములే చేసెదమయ్యా     " హర "

బిల్వా పత్రముతోనూ
కాశీ గన్నేరులతోనూ
అర్చనలే నీకు చేసెదమయ్యా   " హర "

రంభా ఫలములతోనూ
నెయ్యి పాయసముతోనూ
నైవేద్యములే ఒసగెదమయ్యా
ఆరగించి మము బ్రోవుమయ్యా   " హర "

దివి కైలాసములోనా
వెలసిన ఓ మహదేవా
భువిలో నీ దాసులనూ
ఆదరించి దరి చేర్చుకోవా   " హర "

ఓ....కైలాస హిమగిరి శంకరా - భజన

ఓ....కైలాస హిమగిరి శంకరా
కరుణించవేమయా
మనసార మోము చూపించవా...2

నీలకంఠా నిను చూడగోరి
నిరతమూ నిను ప్రార్థింతురా
జగతినేలా జాగేల దేవా
జ్యోతులివిగో జగమేలయా
కరుణించవేమయా
మనసార మోము చూపించవా   " ఓ "

మనసు నిలిపిన మహనీయులెందరో
జన్మ సద్గతి సాధించిరీ
కానరాని కలిమాయలోనా
గమ్యమెరుగక పడిపోతినీ
కరుణించవేమయా
మనసార మోము చూపించవా  " ఓ "

చంద్రమౌళీ చితభస్మధారీ
చంద్రకిరణాల తేజోవిహారీ
దండమోయీ ఓ లింగరూపా
అండ నీవే భూతాధిపా
కరుణించవేమయా
మనసార మోము చూపించవా  " ఓ "

నిరంతర విద్యుత్ లభించిందని ఆనందించాలో - కవిత

నిరంతర విద్యుత్ లభించిందని ఆనందించాలో
అజాగ్రత్త,నిర్లక్ష్యం తో విద్యుత్ షాక్ తో ప్రాణాలు పోతున్నయని బాధపడాలో
అర్థం కావడం లేదు
విద్యుత్ శాఖ ప్రచార తీవ్రత పెరగాలో,వ్యవసాయ శాఖ ప్రచార తీవ్రత పెరగాలో,స్వీయ అవగాహన పెరగాలో
అర్థం కావడం లేదు
కాలం కలిసి రాక ,పంట నష్టపోయి కొందరు చనిపోతుంటే
అన్నీ బాగుండి ,చిరు జాగ్రత్తలు తీసుకోకుండా ,విద్యుత్ షాక్ తో చనిపోవడం ఏమిటో
అర్థం కావడం లేదు
వార్తా పత్రికలు చదువుతూ,ఇతరుల అనుభవాల నుండి గుణపాఠం ఎపుడు నేర్చుకుంటామో
అర్థం కావడం లేదు
ఇంకెంత కాలం ఈ ఏమరుపాటు చర్యలు కొనసాగి విలువైన ప్రాణాలు కోల్పోతాయో
అర్థం కావడం లేదు
కాంక్రీట్ పని చేసే కార్మికులు సైతం కాళ్ళకు,చేతులకు రక్షణ తొడుగులు ధరించి పనులు చేస్తున్న ఈ కాలంలో
నీరు నిప్పు విద్యుత్ లతో చెలగాటం ప్రమాదకరమని తెలిసీ
కనీస రక్షణ చర్యలు చేపట్టకుండా కరెంట్ షాక్ కు బలైపోవడం ఏంటో
అర్థం కావడం లేదు
నీ పని నువ్వు చెయ్ ,ఫలితం నాకొదిలెయ్ అన్న శ్రీకృష్ణుడి కర్మ సిద్ధాంతాన్ని
సక్రమంగా ఎపుడు పాటిస్తామో అర్థం కావడం లేదు
ఇకనైనా చైతన్యం తెచ్చుకొని చిరు,తగు జాగ్రత్తలు తీసుకుని ,ప్రాణాల విలువ తెలుసుకొని కాపాడుకుంటారో లేదో
అర్థం కావడం లేదు
ఆ భగవంతుడి దయ ఎపుడు కలుగుతుందో
ఈ దుస్సంఘటనలు ఎపుడు ఆగిపోతాయో
అర్థం కావడం లేదు

తలకు తప్పకుండా ధరించండి హెల్మెట్/శిరస్త్రాణం... - కవిత

తలకు తప్పకుండా ధరించండి హెల్మెట్/శిరస్త్రాణం...
లేకుంటే వినాల్సివస్తుంది మృత్యుగానం...
అవుతుంది నెత్తుటితో స్నానం...
రహదారులు ,వాహనాలకు వుండదు ప్రాణం...
అవి తప్పించలేవు జరిగే దారుణం...
అత్యంత విలువైనది మీ ప్రాణం...
మీ కుటుంబసభ్యులకు మీరంటే ఎంతో ప్రాణం...
చేయాలి మీరు జీవితంలో ఎంతో ప్రయాణం...
అందుకై నేడే చేయండి ప్రమాణం...
ధరిస్తామని తలకు శిరస్త్రాణం...

ఆత్మహత్యలు వద్దు...- కవిత

ఆత్మహత్యలు వద్దు...
జీవితమెంతో ముద్దు...
కృషితో నాస్తి దుర్భిక్షం అనడం కద్దు...
పల్లె ఐనా పట్టణమైనా పరాయి దేశమైనా పనిచేసుకునేవారికి ఆకాశమే హద్దు...
మహనీయుల మాటలు మరువ వద్దు...
సత్సాంగత్యం సద్గ్రంధ పఠనం కలిగించును లాభాల పద్దు...
సమీపానే ఉంది విజయపు సరిహద్దు...
పదే పదే ప్రయత్నించడం మానవద్దు...
తప్పకుండా ఉదయిస్తుంది తొలి పొద్దు...
ఆత్మహత్యా ఆలోచనలు అసలే వద్దు...
గమనించు కర్షక కార్మిక తాడిత పీడిత మిత్రమా ...
ఆత్మహత్యలు వద్దు...

చిరుజల్లులే జడివానగా మారి కురిపించును భారీ వర్షం...- కవిత

చిరుజల్లులే జడివానగా మారి కురిపించును భారీ వర్షం...
చిన్నవాడైనా అగును పెద్ద మనసున్నవాడుగా...
చిట్టెలుకయే ఆపదలో కాపాడెను మృగరాజును...
చిగురుటాకులే మార్చును చిన్న మొక్కను మహా వృక్షంగా...
చిరు గింజయే పుట్టించును మధుర ఫలాలనిచ్చే వృక్షాన్ని...
చిరు అడుగులే చేర్చును ఎంత పెద్ద గమ్యమైనా...
చిల్లర పోగేస్తే మారుతుంది ఆపదలో ఆదుకునే నేస్తంగా...
చిరుగాలి కలిగించును మనసుకు ఎంతో హాయి...
చిరు ఉడుతయే నిలిచెను సహాయానికి మారు పేరుగా...
చిరు అణువుయే సృష్టించును మహా ప్రళయం...
చిరు వామనుడే ఆక్రమించెను ముల్లోకాలను చిరు అడుగులతో...
చిరు రంధ్రమే ముంచి వేయును పెద్ద ఓడను మహా సముద్రంలో...
చిరు తిండియే పాడు చేయును విలువైన ఆరోగ్యాన్ని...
చిరు వైరసే కబళించివేయును విలువైన ప్రాణాలను...
చిరు అంటేనే జ్ఞప్తికి వచ్చును పవర్ ఫుల్ " మెగా స్టార్ "...
చిరు స్టెప్పులేస్తే తన్మయత్వంతో ఊగిపోవును సినీ అభిమానులు ...
చిరు చీమ యే నిలిచెను శ్రమకు స్ఫూర్తిగా
చిరు అపార్థమే కలిగించును సంబంధబాంధవ్యాల విచ్చిన్నం
చిరు గడ్డి పోచలే ఐక్యమై బంధించును గజరాజును సైతం...
చిరు మెజారిటీ ఐనా నిలుపును విజేతగా ఎంత పెద్ద పందెంలోనైనా...
చిరు ధాన్యాలు కలిగియుండెను ఎన్నో పోషకవిలువలు...
చిరు బాలల హృదయాలే వెలుగొందెను నిష్కల్మష దైవ మందిరాలుగా
చిరు బాల వాక్కుయే వర్ధిల్లెను బ్రహ్మ వాక్కుగా...
చిరు ప్రాయ జ్ఞాపకాలే కలిగించును ఎంతో ఆనందం...
చిరు శిశువులే నిరూపించెను సతీ అనసూయా దేవి మహిమను...
చిరు బాలలతో ఆటలాడెను సద్గురు శ్రీ సాయినాథులు...
చిరు నలుసే కలిగించును కంటికి ఎంతో బాధ...
చిరు ప్రహ్లాదుడే నిరూపించెను హరి నామ మహిమను...
చిరు కృష్ణుడే చూపెను ఎన్నో మాయా లీలలు...
చిరు చక్కిలిగిలే కదిలించివేయును ఎంతటి భారీ శరీరాన్నైనా...
చిరు శబ్దమే కాపాడెను ధర్మరాజు సత్య సంధతను...
చిరు బాలల పలుకులే కలిగించును మనసుకెంతో మురిపెం...
చిరు పల్లెలే అయ్యెను దేశానికి పట్టుగొమ్మలు...
చిరు తప్పిదము దారితీయును పెను ప్రమాదానికి...
చిరు దీపమే తరిమికొట్టును కారు చీకట్లను
చిరు ఏదైనా కలిగించును నష్టమైనా లాభమైనా భారీగా...
" చిరు అంశం " పట్ల ఎప్పుడూ " చిన్న చూపు " వలదు సుమా...

ఈత...నేర్చితే మార్చును మన తల రాత...- కవిత

ఈత...నేర్చితే మార్చును మన తల రాత...
లేకపోతే మిగిల్చును తల్లిదండ్రులకు గుండె కోత...
నేర్పాలి అందరికి ఈత...
అందించాలి అందరికి వరదల్లో చేయూత...
ప్రాణరక్షణ విద్యల్లో నైపుణ్యత..
పొడిగించును మన జీవితపు పొదుపు ఖాతా...
జన్మనిస్తుంది మాత...పునర్జన్మనిస్తుంది ఈత...
ఈత..చక్కని ఆరోగ్యానికి మేత...

చిట్టి పొట్టి చిన్నారి ఉడతా...- కవిత

చిట్టి పొట్టి చిన్నారి ఉడతా...
ఎంతో అలరిస్తోంది నీ బుడి బుడి నడక...
చక చక చెట్టెక్కి వేస్తావు పడక...
కొమ్మల చాటునుండి నీ తొంగి తొంగి చూపులు చూడడం మాకెంతో వేడుక...
నీ ఆనందాలకు కావాలి ఆలవాలం మా హరితహార కార్యక్రమం...
సదా అలరించు నీ బెదురు బెదురు చూపులు,ఆటపాటలతో...
పెంపొందించు నీవంటి భక్తినైనా శ్రీరాముని పట్ల మాలో...
ఉడుతా భక్తిగా పెంచెదము  నీకై మధుర ఫలాల వృక్షాలు ఎన్నో...
కనులారా వీక్షించి కడుపారా భుజించి ఆశీర్వదించు మా ఆబాలగోపాలమ్ము.

ఏమని వర్ణించనూ... - కవిత

ఏమని వర్ణించనూ...
గోమాత నీ కరుణా కృపా కటాక్షముల్ దక్క...
నేనేంత అదృష్టవంతుడినో...
సదా కురిపించు నీ దయార్ద్ర హృదయ వీక్షణములు...
నీ పాల మురిపాల వెల్లువలో తడిసి ముద్దయేలా...
ప్రియమార ఆలింగనముల్ సేతు ...
కడుపార పాలిచ్చి కరుణించు మమ్ము మా తల్లి..మా కల్పవల్లి...గోమాత...

ఎవరూ ఎవరిని సరిగా అర్థం చేసుకోవడం లేదు నేటి సమాజంలో... - కవిత

ఎవరూ ఎవరిని సరిగా అర్థం చేసుకోవడం లేదు నేటి సమాజంలో...
అంతా "అర్థం"గురించే అలోచిస్తున్నారు ఎక్కువగా నేటి  సమాజంలొ...
అది అర్థం పర్థం లేని అలోచన అని తెలిసినా మానడం లేదు నేటి సమాజంలో...
అసలు పరమార్థం అర్థం చెస్కోవడం జరగాలి నేటి  సమాజంలో...
నిరర్థక ప్రయత్నాలు ప్రయోజనాలు వ్యర్థం అని తెలుసుకోవడం జరగాలి నేటి సమాజంలో...
అర్థవంతమైన పనులు ప్రవర్ధిల్లాలి నేటి సమాజంలో...
అపుడే జనుల జీవితం సార్థకత అవుతుంది నేటి సమజంలో...

మొదలైంది ఎండాకాలం...కవిత

మొదలైంది ఎండాకాలం...
జ్వలిస్తోంది భానుడి ప్రతాపం...
ఆవిరి అవుతోంది ఒంట్లోని జలం...
తక్షణమే పడాలి జాగ్రత్త మనం...
దూరంగా ఉంచాలి కృత్రిమ శీతల పానీయం...
విరివిగా తాగాలి కొబ్బరి బోండాం...
విడవకుండా తాగాలి నిమ్మ రసం...
కలవకుండా చూడాలి కలుషిత జలం...
శుభ్రంగా తాగాలి శుద్ధ జలం...
మరువవద్దు ఉల్లి చేసే సాయం...
ఆనందంగా తాగాలి అంబలి మనం...
చిరు జాగ్రత్తలే చూపెట్టును ఎంతో గుణం...
సదా విశ్రమించాలి చెట్టు నీడలో మనం...
క్షెమంగా గడవాలి ఈ వేసవి కాలం...

Tuesday, 28 August 2018

ఇంకా కొన్ని మిగిలే వున్నాయి పూడ్చివేయని బోరు బావులు - కవిత

ఇంకా కొన్ని మిగిలే వున్నాయి పూడ్చివేయని బోరు బావులు...
మాయం చెయ్యడానికి పసి పాపల బోసి నవ్వులు ,
తక్షణమే గుర్తించాలి ఆ తావులు ...
నివారించాలి పసిపిల్లల అకాల చావులు ,
అసలే సమాజం ఎదుర్కుంటోంది ఎన్నో అకాల చావులు...
మధ్యలో దాపురిస్తున్నాయి ఈ నిర్లక్ష్యపు చావులు ,
ఇకనైన మేల్కొని పూడ్చివేయండి పనికిరాని బోరు బావులు...
అవ్వండి పిల్లల ప్రాణాలు కాపాడే మహానుభావులు...

రైతు బతకడానికి నిలబడాలి అందరూ వెన్నుదన్నుగా - కవిత


'రైతు బతకడానికి నిలబడాలి అందరూ వెన్నుదన్నుగా...
తలో చెయ్యి వేస్తే జరుగును కార్యక్రమం  సజావుగా...
చిరు ప్రయత్నమైనా ఉపయోగపడును ఉడతా సహాయంగా...
విద్యావంతులు చర్చించాలి సమస్యను సవివరంగా...
యెక్కడికక్కడ ఇవ్వాలి భరోసా ను శీఘ్రంగా...
జరపాలి అవగాహనా శిబిరాలు విరివిగా...
సమస్యలు పరిష్కారాలు  ఉండాలి ఎజెండాలో  ముఖ్యాంశంగా...
ఆత్మహత్యలు పరిష్కారం కావని తెలపాలి సత్వరంగా...
నింపాదిగా అలోచిస్తే దొరుకుతుంది పరిష్కారం ఖచ్చితంగా...

చెరువు - కవిత

చెరువు...
చేసింది ఇన్నాళ్ళు గుండె చెరువు ...
కలిగించింది ఎంతో గుండె బరువు...
తెచ్చిపెట్టింది భరించలేని కరువు...
జనులు చేసారు ఎంతో అరువు...
కొద్దిపాటి శ్రద్ధతో నవీకరించబడిన చెరువు...
ప్రస్తుతం చూపుతోంది ఎందరికో బ్రతుకు తెరువు...
కాసింత కరుణ చూపితే చెరువు...
అందరికీ ఇచ్చును ఆదరువు..
చెరువు సబ్బండ వర్ణాల బ్రతుకు ద్వారాలు తెరువు,
చెరువు సకల జనుల కోరికలు తీర్చే కల్పతరువు,
జలకళతో ఉట్టిపడే చెరువు
అభివృద్ధికి బాటలు పరువు. షుభమధ్యహ్నం.

'స్వామియే శరణమయ్యప్పా చేయుమయ్యా మా కష్టాలు స్వాహా - కవిత


'స్వామియే శరణమయ్యప్పా చేయుమయ్యా మా కష్టాలు స్వాహా...
హరిహరసుత అయ్యప్పా అనిపించు మా బాధలు హరీ...
మణికంఠ అయ్యప్పా చేయవయ్యా మా మాయా భ్రాంతులను మాయం...
ధర్మశాస్తా అయ్యప్పా నడిపించు మమ్ము తప్పకుండా ధర్మం...
శబరిమల వాసా అయ్యప్పా మార్చుము మమ్ము మాత భక్త శబరిలా...
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్పా...

'నిన్ను నమ్మి నిశిరాత్రి వేళ నిశ్చింతగా నిదురపోతున్నాము - కవిత


'నిన్ను నమ్మి నిశిరాత్రి వేళ నిశ్చింతగా నిదురపోతున్నాము...
ఓ నీరజాక్షా నీవే మాకు సదా రక్ష...
సకల చరాచర జగధ్రక్షకా శరణు శరణు...
నీకై ప్రాణార్పణ సైతం గావింతుము పాహిమం పాహిమం ఓ పద్మజాక్షా...
సదా ధర్మవర్తనులుగా  మా ప్రయాణం గావించు ఓ కమలాక్షా...
వైషమ్య రహిత జీవితం వరప్రసాదం గావించు ఓ విరూపాక్షా...
కృతజ్ఞులమై ఉందుము హృదయపూర్వక వందనాలతో ఓ వనజక్షా...
విలువైన విద్యలెన్నో నేర్చి వినువీధులకెక్కేలా చూడు ఓ విమలాక్షా...

ఎంతెంత దయ నీది ఓ సాయి - భజన

ఎంతెంత దయ నీది ఓ సాయి
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి 2    " ఎంతెంత "

తొలగించినావు వ్యాధులు ఊదితో
వెలిగించినావు దివ్వెలు నీటితో 2
నుడులకు అందవు నుతులకు పొంగవు 2
పాపాలు కడిగేటి పావన గంగవు   " ఎంతెంత "

భక్త కబీరే నీ మతమన్నావు
భగవానుడే నీ కులమన్నావూ 2
అణువున నిండిన బ్రహ్మాండమున 2
అందరిలో నీవె కొలువై ఉన్నావు   " ఎంతెంత "

ప్రభవించినావు మానవ రూపమై
ప్రసరించినావు ఆరని జ్యోతివై  2
మారుతి నీవే గణపతి నీవే 2
సర్వ దేవతల నవ్యాకృతి నీవె   " ఎంతెంత "

గణ నాయకం గణేశ్వరం - భజన

గణ నాయకం గణేశ్వరం
సాయి గణ నాయకం గణేశ్వరం
గౌరీ తనయం గజాననం గౌరీ తనయం గజాననం  " గణ "

మూషికవాహన శ్రీ గణనాథం 2
పాషాంకుశధర బాల గజాననం 2
ఆనంద తాండవ నర్తన గణపతిం 2
నర్తన గణపతిం
వినాయకం విఘ్ననాశకం విఘ్నేశ్వరం 2  " గణ "

జగదభి రామా రఘుకుల సోమా - భజన

జగదభి రామా రఘుకుల సోమా
శరణములీయవయా రామా కరుణను చూపవయా 2

కౌశిక యాగము కాచితివయ్యా
రాతిని నాతిగ చేసితివయ్యా 2
హరివిల్లు విరిచీ మురిపించు సీతను 2
పరిణయమాడిన కళ్యాణరామా
శరణములీయవయా రామా కరుణను చూపవయా     " జగ "

ఒకటే మాటా ఒకటే బాణము ,
ఒకటే సతియని చాటితివయ్యా,
దుజనులనణచి సుజనుల బ్రోచిన
ఆదర్శమూర్తివి నీవేనయా
శరణములీయవయా రామా కరుణను చూపవయా     " జగ "

జయ జయ రాం జానకి రాం 2
పావన నాం మేఘశ్యాం 2

Monday, 27 August 2018

సిరిసిల్లలో సాంచల సవ్వళ్ళు - కవిత

సిరిసిల్లలో సాంచల సవ్వళ్ళు,
నేతన్నలలో ఆనందానికి ఆనవాళ్ళు,
కష్టాల బడబాగ్నిపై కురుస్తున్న పన్నీటి జల్లు,
హృదయాలలో మ్రోగుతున్న హరివిల్లు,
నయనాలలో వర్షిస్తున్న ఆనందపు కన్నీళ్ళు,
శ్రమైక జీవులలో సౌందర్యం పరిఢవిల్లు,
నిరంతర కృషితోనే కష్టాలకు చెల్లు,
నిర్లక్ష్యం వహిస్తే అభివృద్ధి కునారిల్లు.

పాడగా పాడగా - కవిత


పాడగా పాడగా రాగమతిశయిల్లుచునుండు,
వేడగా వేడగా శ్రీకృష్ణుడు కరుణించుచునుండు,
వడి వడిగా గంగను గైకొని శ్రీశైలం వచ్చుచునుండు,
శివ శివా అంటూ మల్లన్నకు అభిషేకం గావించుచునుండు,
వెను వెంటనే నాగ 'అర్జునుని ' చేర పయనమవ్వుచునుండు,
క్రిష్ణ క్రిష్ణా యని అర్జునుడు ఆలింగనం చేసుకొనుచుండు,
జయ జయ ధ్వానాలు మిన్ను ముట్టగా నర నారాయణుల కలయిక అచ్చెరువొందించుచునుండు,
శ్రీ క్రిష్ణార్జునుల కలయిక తెలుగు ప్రజల నట్టింట్లో సిరుల పంట పండించుచునుండు,
జయజయహే శ్రీక్రిష్ణా నమో నమ:

Monday, 20 August 2018

పొలం లో నిరంతరమైన విద్యుత్ వెలుగు - కవిత

పొలం లో నిరంతరమైన విద్యుత్ వెలుగు,
నయనం లో నాణ్యమైన ఆరోగ్యపు వెలుగు,
కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ లతో కన్యల మొహాలు వెలుగు,
.ఆసుపత్రి లో సహజమైన ప్రసవం కలుగు,
కెసీఆర్ కిట్ లతో పచ్చి బాలింత,పసిగుడ్డులకు ఆసరా కలుగు,
గురుకులం లో ఆనందకరమైన అభ్యసనం కలుగు,
మిషన్ కాకతీయలో పేరుకున్న పూడిక తొలుగు,
చెరువులలో జలకళతో పారుతున్న అలుగు,
హరితహారంలో పుడమికి పచ్చదనపు వెలుగు,
పాఠశాలల్లో వెలుగుతున్న తీయనైన తెలుగు,
సదా మెలకువలో ఉండి జాగరూకతతో మెలుగు,
అపుడే తెలంగాణలో నిజమైన అభివృద్ధి కలుగు.

Thursday, 16 August 2018

ప్రాణ్ ప్రదాతా సంకట్ త్రాతా - భజన

ప్రాణ్ ప్రదాతా సంకట్ త్రాతా
హే సుఖ్ దాతా ఓం ఓం
సవితా మాతా పితా వరేణ్యం
భగవాన్ భ్రాతా ఓం ఓం
తేరా శుద్ధ్ స్వరూప్ ధరే హం
ధారణ్ దాతా ఓం ఓం
ప్రజ్ఞా ప్రేరిత్కర్ సుకర్మ్ మే
విశ్వ విధాతా ఓం ఓం

ఓమానంద్ ఓమానంద్ ఓమానంద్ ఓం ఓం
బ్రహ్మానంద్ ఓమానంద్ ఓమానంద్ ఓం ఓం

చేనేత బతుకులు - కవిత

నాడు

చెడు కాలము దాపురించగా
చేదెక్కినవి చేనేత బతుకులు
ఇక గతం ఒక పీడ కల
నేడు శుభగడియలు రాగా
నేతి మిఠాయిలు తిన్నట్లుగా
మారినవి నేతన్న బతుకులు

నేడు
ఇది నెరవేరిన కల

గంజి నీళ్ళు నీవు తాగి
అన్నం పిల్లలకు తినిపించి
కష్టాల కడలి ఈదుతూ
ప్రాణాలు కళ్ళలో పెట్టుకుని
దీనంగా దిన దిన గండంగా
బ్రతికిన ఓ నేతన్నా
నీ మొర ఆలకించిరి దేవతలు
కలిగించిరి చంద్రశేఖరుని మదిలో ఆలొచనలు
కురిపించిరి పథకాల వరాల జల్లు
ఇక నీ కష్టాలకు శాశ్వత సెలవన్నా

ఓ నేతన్నా

మంచు కురవనీ - కవిత

మంచు కురవనీ,
మనసు మురవనీ,
వర్షం కురవనీ,
తనువు తడవనీ,
విత్తు మొలవనీ,
పుడమి పులకరించనీ,
మొక్క పెరగనీ ,
మోము వికసించనీ,
పూలు పూయనీ,
పూజలు చేయనీ,
కాయలు కాయనీ,
కాలం సాగనీ,
పంటలు పండనీ,
ఫలం లభించనీ,
ఆదాయం ఆర్జించనీ ,
ఆబాలగోపాలం ఆనందించనీ,
గుళ్ళో జేగంట మోగనీ,
గుండె ఉప్పొంగనీ,
దేవుడు కరుణించనీ,
వరములు కురిపించనీ...

Saturday, 11 August 2018

సూడు సూడు నల్లగొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ - కవిత

సూడు సూడు నల్లగొండ
గుండె మీద ఫ్లోరైడ్ బండ
ప్రజలందరూ బేజారెత్తుతుండ
బద్దలు కొట్టెనంట ఎముకలేమీ మిగులకుండ
ప్రార్ఠించిరి ప్రజలు పట్టు విడువకుండా
సాధించిరి భగవదనుగ్రహము సంతసము నిండా
అభయమిచ్చెను భగవానుడు మది నిండా
భయము వలదనెను చంద్రశేఖరుడు అండగా నుండ
సారించెను దృష్టి సమస్య గుండా
సాధించెను కృష్ణా ,భగీరథుల అండ
బద్ధలాయెను ఫ్లోరైడ్ బండ
ప్రజల గుండెలు తేలిక అగుచుండ
పారిపోయెను ఫ్లోరైడ్ రక్కసి దరిదాపులలో కనబడకుండా
ఇక పరిగెత్తును అభివృద్ధి ఎముకలు గట్టిపడుచుండ
తెలపాలి కృతజ్ఞతలు ఎల్లరకు హృది నిండా

Tuesday, 7 August 2018

కరుణ జూపుమా ఓ రామా కళ్యాణ రామా - భజన

{ఆరనీకుమా ఈ దీపం శైలిలో....}

కరుణ జూపుమా ఓ రామా కళ్యాణ రామా
కోపమా మా పైన నీకు కోదండ రామా

మధురమురా రామా నీ నామము
మధురముగా నీ భజనలు చేయుదు........ " కరు"

ఆ ఆ ఆ

ఈ సృష్టికి సూర్యుని రూపున వెలిగే శృంగార రూపం
నా కంటి పాపలో కదలాడే నీ కమనీయ రూపం
నా ఆత్మలో వెలిగే దీపం
ఈ దీనుని పాలిట దివ్య స్వరూపం.... " కరు "

ఆ ఆ ఆ

రాముడవైనా శ్యాముడవైనా నీవేరా రామా
రామాయను రెండక్షరమ్ములు మధురమ్ముర రామా
సురులైనా నరులైనా
తృప్తిగ కొలిచే సుందర రూపం...   " కరు "

ఆ ఆ ఆ

పంచరంగుల రూపుడవయ్యా పరమాత్మా నీవు
రాజేశ్వరుడు గతియించెనురా రక్షింపుర రామా
నే కోరేది ఒకటే వరము
ఈ జీవాత్మకు ముక్తి మార్గము ... " కరు "

ఆ ఆ ఆ

Wednesday, 1 August 2018

సకల విద్యల సారం సంస్కారం - కవిత

సకల విద్యల సారం సంస్కారం ,
ఇది లేని జీవితం అగును నిస్సారం ,
సరిగా పాటిస్తే పొందెదము సత్కారం ,
లేకపొతే అనుభవమగును చీత్కారం ,
పెట్టెదరు జనం ఓ పెద్ద నమస్కారం ,
పాడైపోవును మన గ్రహ చారం ,
సంస్కారం పట్లనే మనం పెంచుకోవాలి మమకారం ,
పాటిస్తే దీనిని ఒక పద్ధతి ప్రకారం ,
అందును అన్ని వైపుల నుండి మనకు సహ కారం ,
పొందును సకల సమస్యలు పరిష్కారం ,
అగును జీవిత కలలు సాకారం ,
తొలగిపోవును జీవితం లోని అంధకారం ,
అనుభవమగును మధుర జీవన సారం.

సేవా భావం ఒక అమూల్యమైన ఆభరణం - కవిత

సేవా భావం ఒక అమూల్యమైన ఆభరణం,
ధరించాలి నిరంతరం దీనిని మనం,
తపించాలి దీనికై అనుక్షణం మనం,
వెచ్చించ్చాలి సమయం దీనికై అనుదినం,
సాధించాలి దీనిలో పరిణతి దినదినం,
తరించాలి సేవలో ప్రతి క్షణం,
లీనమవ్వాలి దీనిలో ప్రతి దేహకణం,
తగ్గించాలి సేవతో ఆందోళన ఇతరులలో మనం,
పెంపొందించాలి ఇతరులలో సేవా గుణం,
పంచుకోవాలి ఆ ఆనందం ఇతరులతో మనం,
పెంచాలి సేవతో ఇతరులలో మంచి తనం,
గ్రహించాలి ఇతరులలోని మంచిని మనం,
చిందించాలి సేవలో స్వేదం జనం
అనుగ్రహించాలి బాలలను సేవతో మనం,
నేర్పించాలి భావితరాలకు ఈ సుగుణం
గర్వించాలి భావితరాలు చేసుకొని మనల్ని మననం