Thursday, 30 August 2018

నిరంతర విద్యుత్ లభించిందని ఆనందించాలో - కవిత

నిరంతర విద్యుత్ లభించిందని ఆనందించాలో
అజాగ్రత్త,నిర్లక్ష్యం తో విద్యుత్ షాక్ తో ప్రాణాలు పోతున్నయని బాధపడాలో
అర్థం కావడం లేదు
విద్యుత్ శాఖ ప్రచార తీవ్రత పెరగాలో,వ్యవసాయ శాఖ ప్రచార తీవ్రత పెరగాలో,స్వీయ అవగాహన పెరగాలో
అర్థం కావడం లేదు
కాలం కలిసి రాక ,పంట నష్టపోయి కొందరు చనిపోతుంటే
అన్నీ బాగుండి ,చిరు జాగ్రత్తలు తీసుకోకుండా ,విద్యుత్ షాక్ తో చనిపోవడం ఏమిటో
అర్థం కావడం లేదు
వార్తా పత్రికలు చదువుతూ,ఇతరుల అనుభవాల నుండి గుణపాఠం ఎపుడు నేర్చుకుంటామో
అర్థం కావడం లేదు
ఇంకెంత కాలం ఈ ఏమరుపాటు చర్యలు కొనసాగి విలువైన ప్రాణాలు కోల్పోతాయో
అర్థం కావడం లేదు
కాంక్రీట్ పని చేసే కార్మికులు సైతం కాళ్ళకు,చేతులకు రక్షణ తొడుగులు ధరించి పనులు చేస్తున్న ఈ కాలంలో
నీరు నిప్పు విద్యుత్ లతో చెలగాటం ప్రమాదకరమని తెలిసీ
కనీస రక్షణ చర్యలు చేపట్టకుండా కరెంట్ షాక్ కు బలైపోవడం ఏంటో
అర్థం కావడం లేదు
నీ పని నువ్వు చెయ్ ,ఫలితం నాకొదిలెయ్ అన్న శ్రీకృష్ణుడి కర్మ సిద్ధాంతాన్ని
సక్రమంగా ఎపుడు పాటిస్తామో అర్థం కావడం లేదు
ఇకనైనా చైతన్యం తెచ్చుకొని చిరు,తగు జాగ్రత్తలు తీసుకుని ,ప్రాణాల విలువ తెలుసుకొని కాపాడుకుంటారో లేదో
అర్థం కావడం లేదు
ఆ భగవంతుడి దయ ఎపుడు కలుగుతుందో
ఈ దుస్సంఘటనలు ఎపుడు ఆగిపోతాయో
అర్థం కావడం లేదు

No comments:

Post a Comment