హెల్మెట్ ... ఒక చిన్న పదం, ధరిస్తే ప్రమోదం లేకుంటే ప్రమాదం...
అణువు... ఒక చిన్నపదం,అనువుగా వడుకుంటే ప్రమోదం లేకుంటే సృష్టించును పెను ప్రమాదం...
బతుకు...ఒక చిన్న పదం,సక్రమంగా సాగిస్తే ప్రమోదం లేకుంటే ప్రమాదం...
బలం ...ఒక చిన్న పదం,కల్గించును ప్రమాదం లో ప్రమోదం,ప్రమోదం లో ప్రమాదం...
ప్రాణం...ఒక చిన్న పదం,తనువులో ఉంటే ప్రమోదం లేకుంటే ప్రమాదం...
విలువ...ఒక చిన్న పదం ,పెంచుకుంటే ప్రమోదం,తగ్గించుకుంటే ప్రమాదం...
శిక్షణ...ఒక చిన్న పదం, పొందితే తప్పించును పెను ప్రమాదం,కలిగించును ప్రమోదం...
వైఖరి...ఒక చిన్న పదం...సానుకూలమైతే ప్రమోదం,ప్రతికూలమైతే ప్రమాదం...
No comments:
Post a Comment