చిట్టి పొట్టి చిన్నారి ఉడతా...
ఎంతో అలరిస్తోంది నీ బుడి బుడి నడక...
చక చక చెట్టెక్కి వేస్తావు పడక...
కొమ్మల చాటునుండి నీ తొంగి తొంగి చూపులు చూడడం మాకెంతో వేడుక...
నీ ఆనందాలకు కావాలి ఆలవాలం మా హరితహార కార్యక్రమం...
సదా అలరించు నీ బెదురు బెదురు చూపులు,ఆటపాటలతో...
పెంపొందించు నీవంటి భక్తినైనా శ్రీరాముని పట్ల మాలో...
ఉడుతా భక్తిగా పెంచెదము నీకై మధుర ఫలాల వృక్షాలు ఎన్నో...
కనులారా వీక్షించి కడుపారా భుజించి ఆశీర్వదించు మా ఆబాలగోపాలమ్ము.
No comments:
Post a Comment