కొత్త పని లేదా కొత్త వ్యాపారం విజయదశమి నాడు ప్రారంభిస్తే మంచిదని అంటారు .ఏడాదిలో వచ్చే అత్యంత శక్తివంతమైన ముహూర్తాలలో విజయదశమి ఒకటని పంచాంగం పేర్కొంటుంది .దీనిని స్వయం సిద్ధ ముహూర్తం అని పిలుస్తారు. అంటే ఈరోజున ప్రత్యేకంగా అమృత ఘడియలు లేదా శుభ సమయం చూసుకోవాల్సిన అవసరం లేదు .సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రతి క్షణం శుభప్రదమే .ఇది చెడు పైన మంచి గెలిచిన రోజు కాబట్టి ఏ కొత్త పని చేపట్టినా దైవ బలం కూడా తోడుగా అవుతుందని అంటారు .అందుకే ఏవైనా కొనాలనుకున్నా ,వ్యాపారం చేయాలనుకున్నా ,కొత్త విద్యను నేర్చుకోవాలనుకున్నా ఈ రోజును ఎంచుకుంటారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి