14, నవంబర్ 2026, శనివారం

వెంకటేశ్వరుడి చిత్రకారుడు.. శ్రీనివాసన్



 తిరుమల వెంకటేశ్వర స్వామి తో పాటు పలు దేవతామూర్తుల పెయింటింగులు గీసిన చిత్రకారుడు శ్రీనివాసం ( 86 )గారు వృద్ధాప్య కారణాలతో గురువారం తన స్వగృహంలో మృతి చెందారు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి కి చెందిన శ్రీనివాసన్ పదవ తరగతి వరకు చదువుకున్నారు. ప్రముఖ చిత్రకారుడు కెండయ్య రాజు వద్ద చిత్రకళ నేర్చుకున్నారు. 1970లో టిటిడి ఆహ్వానం మేరకు ఆలయ గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వరుడిని నేరుగా చూసి ఆ రూపాన్ని గీశారు. స్వామివారు నగలు ధరించి ఉండగా, ధరించకుండా ఉన్నప్పటి రెండు రకాల చిత్రాలను ఆయన వేశారు. ఈ పెయింటింగ్ లకు అప్పట్లో దేవస్థానం ఆమోదం తెలిపింది. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి