కార్తీక మాసంలో వనభోజనం ప్రాధాన్యత ఏమిటంటే..
యః కార్తికే సితే పక్షే, వన భోజన మాచరేత్.. సయాతి వైష్ణవం ధామం, సర్వ పాపై: ప్రముచ్యతే..
అంటే కార్తీకమాసం శుక్లపక్షంలో వన భోజనం చేసిన వారు పాపాల నుండి విముక్తి పొంది విష్ణు లోకాన్ని పొందుతారని కార్తీక పురాణం చెబుతున్నది .కార్తీక మాసంలో శ్రీలక్ష్మి, నారాయణులు ఇద్దరు ఉసిరి చెట్టును ఆశ్రయించి ఉంటారని విష్ణు పురాణ కథనం. ఉసిరి అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఉసిరి చెట్టును దైవంగా భావిస్తారు. అందుకే వనభోజన సమయంలో ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని గాని ,విగ్రహాన్ని గాని ఉంచి పూజలు చేసి అందరూ కలిసి భోజనాలు చేయడం ఆచారంగా మారింది. శ్రీకృష్ణుడు తన సోదరుడైన బలరాముడు ఇతర గోప బాలురతో కలిసి యమునా తీరం బృందావనంలో ఉసిరి మొదలైన వృక్షాల నీడలో వనభోజనం చేసినట్లుగా భాగవతం పేర్కొంది. సూత మహర్షి శౌన కాది మునులతో కలిసి నైమిశారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనం చేశారని కార్తీక పురాణ కథనం. యుగయుగాలుగా వస్తున్న సంప్రదాయంలో ఆధ్యాత్మికత ఆనందంతోపాటు నలుగురితో కలిసిపోయే సామాజిక చైతన్యము కూడా ఉన్నది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి