1, మే 2026, శుక్రవారం

పుష్కరిణి నీటితో శ్రీవారి చిత్రం

 పుష్కరిణి నీటితో శ్రీవారి చిత్రం.. తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఒక యువకుడు గురువారం నాడు తన కళా ప్రతిభతో భక్తిని వ్యక్తం చేశాడు. తమిళనాడులోని తిరువూరుకు చెందిన మోహన్ ప్రభువు అనే భక్తుడు గత పది సంవత్సరాలుగా పెయింటింగ్ చేస్తూ తన ప్రతిభను చాటుకున్నాడు. 

శ్రీవారి పుష్కరిణి నీటిని ఉపయోగించి సుమారు మూడు గంటల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తలుచుకుంటూ వాటర్ పెయింటింగ్ రూపొందించాడు. అతని భక్తిని కళా నైపుణ్యాన్ని చూసిన పలువురు భక్తులు ప్రశంసించారు. 





ఆలయంలో అన్నప్రసాద వితరణ

 బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో గురువారం దాతలు పోల విట్టల్ గుప్తా, కుటుంబ సభ్యులు, డాక్టర్ తుకారం దంపతులు , బెజుగం శంకర్ దంపతులు భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు .ఆలయ అర్చకులు ఉదయం నుంచి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు .భక్తులు సమర్పించిన నూతన వస్త్రాలతో స్వామిని అలంకరించారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.