24, నవంబర్ 2026, మంగళవారం

ముందు మల్లన్న లగ్గం

 ప్రస్తుత కార్తీకమాసంలో పెళ్లి ముహూర్తాలు ఉండడంతో దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయి .ఎక్కడ చూసినా పచ్చని పందిళ్లు, భాజా భజంత్రీలతో పెళ్లి సందడి కనిపిస్తుంది. తెలంగాణలోని నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఎడ్ బిడ్ , కరేగాం, వెంకటాపూర్ గ్రామాలలో మాత్రం పెళ్లి సందడి కనిపించడం లేదు .దానికి కారణం శతాబ్దాలుగా ఆయా గ్రామాల ప్రజల నమ్మకం, సంప్రదాయం. ఆ గ్రామాల పరిధిలో కొలువైన మల్లన్న దేవుడు కళ్యాణం తర్వాతే తమ పిల్లల పెళ్లి ముహూర్తాలు ఖరారు చేయడం అక్కడ ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏటా జనవరి ,ఫిబ్రవరి నెలలలో వచ్చే మాఘ పౌర్ణమి రోజు మల్లన్న దేవుడికి నియమనిష్ఠలతో కళ్యాణం జరిపిస్తారు. అప్పటి నుండి శ్రావణ మాసం వరకు ఉండే ముహూర్తాలలోనే తమ పిల్లలకు పెళ్లిళ్లు జరిపిస్తారు అక్కడి ప్రజలు .తర్వాత ముహూర్తాలు ఉన్నా పట్టించుకోరు. అలా చేస్తేనే మల్లన్న దయతో అంతా మంచి జరుగుతుందని ఆయా గ్రామస్తుల విశ్వాసం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి