భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అన్నమాచార్య భావనా వాహిని పెద్ద పీట వేస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్లోని మాదాపూర్ లో గల అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "నాద బ్రహ్మోత్సవాలు " వైభవంగా కొనసాగుతున్నాయి.
ఇందులో భాగంగా ఆదివారం నాడు వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఏ ఐ జీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డికి "నవ వైష్ణవ నర" బిరుదు .. సిద్ధ చక్ర రీసెర్చ్ సెంటర్ వైద్యురాలు డాక్టర్ సత్య సింధుజకు " ధైర్య " పురస్కారాన్ని వెంకయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపకురాలు డాక్టర్ శోభారాజు గారు చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయమన్నారు .ఈ కార్యక్రమంలో డాక్టర్ శోభారాజు ,సంస్థ మేనేజింగ్ ట్రస్టీ నందకుమార్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి