కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి నూతన ప్రధాన అర్చకుడిగా / మేల్ శాంతి గా అరీక్కర సుబ్రహ్మణ్యన్ శంకరన్ నంబూద్రి ఎంపికయ్యారు. వార్షిక మండల మకర విలక్కు తీర్థ యాత్ర సీజన్ కు కొన్ని వారాల ముందే ఆదివారం నిర్వహించిన లక్కీ డ్రా / కులుక్కల్ ద్వారా ట్రావెన్ కోర్ బోర్డు ఈ ఎంపికను ఖరారు చేసింది. ఈ లక్కీ డ్రా లో మొత్తం ఏడుగురు పాల్గొన్నారు. దీనితో పాటు శబరిమల దేవాలయానికి దాదాపు 100 మీటర్ల దూరంలో గల మాలికాపురం దేవి ఆలయానికి ఏ. దామోదరన్ నంబూద్రి నూతన ప్రధాన అర్చకుడిగా ఎంపికయ్యారు. మండల మకర విలక్కు సీజన్ ప్రారంభానికి ఒక్కరోజు ముందు అంటే నవంబర్ 16 నుంచి వీరిద్దరూ బాధ్యతలు చేపట్టి సంవత్సరం పాటు ఆయా స్థానాలలో కొనసాగుతారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి