19, అక్టోబర్ 2026, సోమవారం

టగరిన కలగ అంటే..

 కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ లో దసరా సంబరాలలో భక్తితో పాటు పౌరుషం కూడా మిళితమై ఉంటుంది. ఈ ప్రాంతంలో నవరాత్రుల సమయంలో" టగరిన కలగ " పేరుతో పొట్టేళ్ల పోటీ నిర్వహిస్తుంటారు. తెలుగు రాష్ట్రాలలో కోడిపందాల లాగా దసరాకి ఇక్కడ పొట్టేళ్ల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది .ముఖ్యంగా సోమవంశ సహస్రార్జున క్షత్రియ సమాజానికి చెందినవారు పురాతన కాలం నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు .ఇలా చేస్తే అమ్మవారు ప్రసన్నం అవుతారని ఇక్కడి స్థానికుల నమ్మకం. ఈ వేడుకలలో భాగంగా ఆదివారం రెండు పొట్టేళ్ల మధ్యన భీకరంగా పోరు జరిగింది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి