Sunday, 30 September 2018

నమ్మబోకే ఓ జీవా ఇది అంతా మాయా బొమ్మలాటా - భజన

నమ్మబోకే ఓ జీవా ఇది అంతా మాయా బొమ్మలాటా 2
కొన్ని దినములకొరకూ నీకెందుకింత ఉరుకులాటా " నమ్మ "

కొత్త వస్త్రమైతెనేమీ పాత వస్త్రమైతెనేమీ
కట్టు భ్రమ తీరే దాకా ఇది కర్మ భోగ ఫలమంటా " నమ్మ "

తల్లి దండ్రులంతావూ ఇల్లూ వాకిలంటావూ
తల్లి రాదు ఇల్లు రాదూ నీవు తరలిపోయే నాడు వెంటా  " నమ్మ "

అన్నదమ్ములంటావూ అక్కా చెల్లెళ్ళంటావూ
అన్న రాడు అక్కా రాదూ నీవు వెడలిపోయే నాడు వెంటా " నమ్మ "

కొడుకులున్నా బిడ్డలున్నా కోటి సంపద కలిగి యున్నా
కంటికి కన్నీరే కానీ ఎవరూ రారు నీ వెంటా  " నమ్మ "

నడి రోడ్డుపై - కవిత

నడి రోడ్డుపై నాటు ఆయుధాలతో చెట్లను నరికినట్లు మనుషులను నరుకుతుంటే ఆపాల్సింది పోయి
అదేదో నయనానందకరమైన షో జరుగుతున్నట్లు నయా నయా ఫోనులతో నానా రకాలుగా వీడియోలు తీయడం ఏం సోయి
పరిస్థితులు ఏ క్షణమైనా తారుమారు అవుతాయనే ఇంగిత జ్ఞానం పోయి
మనుషులు తీస్తున్నారు వీడియోలు ,షేర్ చేస్తున్నారు వీడియోలు మతి చెడిపోయి
కఠినమైన చట్టాలు చేస్తేనే,కఠిన చర్యలు చేపడితేనే పూర్వపు చైతన్యం వస్తుంది ఈ దారుణమైన రోగం పోయి

Tuesday, 25 September 2018

ఓటు - వెల్లడించును ప్రజల మనసులోని తిరుగుబాటు - కవిత

ఓటు - వెల్లడించును ప్రజల మనసులోని తిరుగుబాటు
ఓటు - నేతల బరువును తూచే తూకపు బాటు
ఓటు - నాయకులకు తెప్పించును తీవ్ర తలపోటు
ఆదమరిచి వ్యవహరిస్తే వేయును వేటు
ఓటు - పౌరుల చేతిలోని క్రికెట్ బ్యాటు
బాగా ఆడితే తెరువును సిక్సర్లకు బార్లా గేటు
కల్పించును విజేతల జాబితాలో చోటు
ఓటు - గుంటూరు మిర్చికంటే ఘాటు
సరిగా వాడితే అది అందించే రుచి ఎంతో గ్రేటు
ఓటు - ఎంతో మందిని చేయిస్తుంది సర్కస్ ఫీటు
ఒకే ఓటు మార్చివేయును ఎంతో మంది ఫేటు
ప్రతి పౌరుడు విధిగా తెలుసుకోవాలి ఎంతో విలువైనదని తన ఓటు
అలా తెలుసుకుని మెదులుకుంటేనే నిజంగా మీరు గ్రేటు.
ఓటు - మనందరికీ కల్పిస్తుంది అద్భుతమైన వెసులుబాటు
ఈ విషయమై ప్రతి ఒక్కరూ అలోచించాలి కొద్ది సమయం పాటు
అప్పుడే ఉండవచ్చు నిశ్చింతగా ఐదు సంవత్సరాల పాటు

ఈ జగమేలు జనని ఓ యమ్మా - భజన

ఈ జగమేలు జనని ఓ యమ్మా
మా బ్రతుకు బాట నీవమ్మా
కరమందు వీణ దాల్చావే
కమలంబులోన వెలిచావె     " ఈ జగ "

మా హృదయ కమల కుసుమం
నీ చరణాల పాదపీఠం
నీ నామ మధుర గానాలే
నిలిచేను ఇలలొ మా కొరకే   " ఈ జగ "

సంగీత కళల జనని
సర్వ లోకాలు బ్రోచె వాణీ
వేదాల వెలుగు నీ చలవే
వెలిసావు ఇలలొ మా కొరకే   " ఈ జగ "

కవులైన పండితులకు
తల్లి నీవేలె వారి బ్రతుకూ
ముక్కోటి దేవతా లోకం
మ్రొక్కేను ముదముతో నిత్యం   " ఈ జగ "

Tuesday, 18 September 2018

తెల్లారినదీ లేరా స్వామీ పూజకు పూవులు పూచినవీ - భజన

తెల్లారినదీ లేరా స్వామీ పూజకు పూవులు పూచినవీ
సన్న జాజులూ బంతి పువ్వులూ వెంకటరమణని కొలచినవీ  " తెల్లా "

గొల్లలు పిల్లలు తలుపులు తెరువగ కర్పూర హారతి ఇచ్చెనులే
పరిమళాలు పంచామృతములతో చక్కటి స్నానము చేయరే   " తెల్లా "

మంగళ హారతి గైకొనుమా మా మానస మంగళ హారతీ
కర్పూర హారతి వెలుగులె నీకు ముత్యాల మంగళ హారతీ   " తెల్లా "

వెండి కొండపై నిండు మనసుతో కోయిల నీకై పాడెనులే
త్యాగయ్య గీతిక పదములె నీకూ ముత్యాల మంగళ హారతీ  " తెల్లా "

ఆనంద సాగరా మురళీధరా - భజన

ఆనంద సాగరా మురళీధరా
మీరా ప్రభో రాధేశ్యామ వేణుగోపాలా

నంద యశోదా ఆనంద కిశోరా
జై జై  గోకుల బాలా జై వేణు గోపాలా                               " ఆనంద "

వెన్న దొంగయా మా చిన్ని క్రిష్ణయా
జై జై గోకుల బాలా జై వేణు గోపాలా                                " ఆనంద "

కౌసల్యా సుప్రజా రామచంద్రా
సీతా మనోహర రాఘవేంద్రా                                          " ఆనంద "

కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా
భక్తా మనోహర స్వామి అయ్యప్పా                                 " ఆనంద "

దీన దయాళో పరిపూర్ణ కృపాలో
జై జై శంకర బాలా జై స్వామి అయ్యప్పా                         " ఆనంద "

పంబా వాస పందల రాజా స్వామి అయ్యప్పా
గౌరీపుత్ర గోకుల రూపా స్వామి అయ్యప్పా
శంభో శంకర శంభో శంకర స్వామి అయ్యప్పా
హరోం హరా హరోం హరా స్వామి అయ్యప్పా                  " కామాక్షి "

అడుగడుగునా పొంచి ఉంది ప్రమాదం అతివలకు నేడు - కవిత

అడుగడుగునా పొంచి ఉంది ప్రమాదం అతివలకు నేడు
ఇంట్లో నుండే సాగించాల్సివస్తోంది పోరాటం ఇంతులకు నేడు
అబలలు కాకూడదు బేలలు ఏనాడు,కావాలి అతిబలవంతులు నేడు
ఖాళీ చేతులతోనే కామాంధుల కావరమణచగలగాలి కాంతలు నేడు
అందుకు ఆత్మ రక్షణ విద్యలు నేర్వాలి అత్యవసరంగా అతివలు నేడు
మానాభిమానాలు కాపాడుకోవాలి మార్షల్ ఆర్ట్స్ తో మహిళలు నేడు
భద్రత భరోసా పొందాలి బ్లాక్ బెల్ట్ లాంటి విద్యలతో బాలికలు నేడు
ఒడుపుగా ఒక్క గుద్దుతోనే ఓటమిని జయించగలగాలి ఒంటరి మహిళలు నేడు
కరుణ ,జాలితో పాటు కాఠిన్యం కూడా నేర్వాలి కన్నె పిల్లలు నేడు
అల్లరి వెధవలకు బుద్ధి చెప్పాలి కాళ్ళూ చేతులే ఆయుధాలుగా చేసి అమ్మాయిలు నేడు
బాక్సింగ్ ,కరాటే లాంటి విద్యలు నేర్వాలి పాఠశాల బాలికలు,సాఫ్ట్ వేర్ ఉద్యోగినులు నేడు
తైక్వాండో లాంటి తన్నుడు విద్యలు తప్పకుండా నేర్వాలి తరుణిలు నేడు
గుర్తెరగాలి పార్వతి లేనిదే శివుడికి ఏనాడు శక్తి లేదని నేడు
స్మరించుకొని సదా సత్యభామను ,ఎదుర్కోవాలి సమస్యను సమర్థంగా నేడు


Saturday, 15 September 2018

శ్రీ గణరాయా జయ గణరాయా - భజన

శ్రీ గణరాయా జయ గణరాయా
శ్రీ గణరాయా జయ గణరాయా గణపతి బప్పా మోరియా గనపతి బప్పా మోరియా

సిద్ధి వినాయక మంగళదాతా
సిద్ధి వినాయక అష్ట వినాయక గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా

                                       "   శ్రీ గణరాయా "

సింధూర వదనా మంగళ చరణా
సింధూర వదనా సుందర వదనా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా              
                             
                                        " శ్రీ గణరాయా "

మూషిక వాహన మునిజన పాలనా
మూషిక వాహన మునిజన పాలన గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా

                                        "  శ్రీ గణరాయా "

ఏమేమౌనో ఏమెరుక - భజన

ఏమేమౌనో ఏమెరుక
ఎటు పోతుందో ఈ నౌక
కావాలన్నది జరిగేనా
కాగలనున్నది ఆగేనా
ఏ ఈతి బాధలు ఎదురైనా
జీవన పయనం ఆగేనా   " ఏమేమౌనో "

గమనం చేసే ఈ నౌక
గమ్యం ఏదొ ఏమెరుక
ఇతరుల జూచి ఏడ్చేము
అతుకుల బ్రతుకును గడిపేము
ఇహ సౌఖ్యముకే మురిసేము
వెతలెదురైతే వగచేము     " ఏమేమౌనో "

ఊహలకందని వాడొకడు ఉన్నాడా జగదీశ్వరుడూ
ఊహలు చెదిరిన రాముడితో ఆహా శివలీలన్నాడు   " ఏమే "

Friday, 14 September 2018

కాలం చెల్లినది ఏదైనా ,వాహనమైనా,రహదారైనా - కవిత

కాలం చెల్లినది ఏదైనా ,వాహనమైనా,రహదారైనా
గుర్తించాలి మనకు నూకలు చెల్లిస్తుందని ఏనాటికైనా
తక్షణమే కళ్ళు తెరవాలి మనం ఇకనైనా
కాలం చెల్లిన వాటికి నూకలు చెల్లించాలి కాస్త కష్టమైనా
రెండో మాటకు తావివ్వొద్దు కలలోనైనా
లేకపొతే సమవర్తి చూపడు పక్షపాతం ,కనికరం లేశమైనా
నిర్దాక్ష్యంగా తీసేస్తాడు మన ప్రాణాలు  యే చోటనైనా, ఆలస్యం చేయకుండా నిమిషమైనా
నాణ్యత లేని వాహనాలు,రోడ్లపట్ల చర్యలు తీస్కోవాలి పట్టుదలగా ఆరునూరైనా
లేకపోతే మన ప్రాణాలు కలుస్తాయి గాలిలో యే క్షణమైనా
మన ఉదాసీన వైఖరి దారి తీయును ప్రమాదానికి యే రోజుకైనా
అసలు నూకలు చెల్లించాల్సింది దీనికేనని గుర్తించాలి ఎవరైనా
నిరంతర ప్రయత్నం జరుగుతూనే ఉండాలి జీవిత నిపుణత సాధించుటకై వీసమెత్తైనా
అపుడే నిజమైన అభివృద్ధి కలుగుతుంది నిదానంగానైనా



జయము జయము జగదాంబ - భజన

జయము జయము జగదాంబ
జయము నీకు భ్రమరాంబ  2
నీకు కోటి దండాలమ్మా ఓ లలితాంబ 2    " జయము "

అమ్మలకు అమ్మవమ్మ జగత్కల్పవల్లివమ్మ 2
ముగ్గురమ్మల మూలపుటమ్మా ఓ లలితాంబ 2   " జయము "

బాసరలో వాణివమ్మ బెజవాడలొ దుర్గవమ్మ 2
కలకత్తా కాళిమాతవూ మా యమ్మ నీవు 2
ఉజ్జయినీ మహంకాళివీ మా యమ్మ నీవు 2
కామారెడ్డి లలితాంబవూ మా యమ్మ నీవు 2    " జయము "

కంచిలోన కామాక్షి మధురలోన మీనాక్షి 2
కాశీలోన విశాలాక్షివీ మా యమ్మ నీవు 2
కాశీలో అన్నపూర్ణవూ మా యమ్మ నీవు 2
కామారెడ్డి లలితాంబవూ మా యమ్మ నీవూ 2    " జయము "

రాజరాజేశ్వరివీ అంబ పరమేశ్వరివీ 2
మహిషాసుర మర్ధినివమ్మా ఓ లలితాంబ 2     " జయము "

తొలి పూజ నీదేలె విఘ్నేశ్వరా - భజన

తొలి పూజ నీదేలె విఘ్నేశ్వరా
ఓ బొజ్జ గణనాథ దీవించరా 2
ఓ...గణనాథా...ఓ... గౌరిపుత్రా   " తొలి "

ఇంతింత కాదయ్య నీ సేవలు
గణమైన పూజలు నీకోసము
పార్వతి నందన లంబోదరా
పావన రూపా విఘ్నేశ్వరా
ఓ...గణనాథా...ఓ... గౌరిపుత్రా    " తొలి "

కోటొక్క దండాలు గణనాథుడా
నీకు పాద నమస్తే లంబోదరా
పసివారి నవ్వులు నీ నవ్వులు
చిన్ని చిన్ని పలుకులు నీ మాటలు
ఓ...గణనాథా...ఓ... గౌరిపుత్రా    " తొలి "

నీకన్న మాకింక ఎవరున్నరు
నీవే కదా మాకు తొలి దైవము
కుడుములు ఉండ్రాళ్ళు నీ కోసమే
మా హృదయ హారతి నీకిత్తుము
ఓ...గణనాథా...ఓ... గౌరిపుత్రా    " తొలి "

Tuesday, 11 September 2018

మధురము హరినామం - భజన

మధురము హరినామం
హరినామ భజనే పరమానందం 2

అనంతశయనానందం
మన్మోహన దివ్యస్వరూపం 2
కాశీ రమణా పద్మనాభం
భజియించగనే జన్మ ధన్యం     " మధు "

చెడుసాంగత్యము విడువూ
నీ గురు పాదాలను కొలువూ 2
అపుడే నీ జన్మకర్థం 2
శ్రీ సత్యసేవయె పరమానందం    " మధు "

స్థిరముగ ఏదీ కాదూ
నీవు కొనిపొయెదేమీ లేదూ 2
మాయా బంధాలను విడువు 2
దొరుకునయా హరి దర్శనంబు       " మధు "

నటరాజ గంగాధరా - భజన

నటరాజ గంగాధరా
హే జటధారి గంగాధరా 2

అట జూడ నీవే ఇట జూడ నీవే
ఎటు జూసినా నీవే  2
ఘటమందు నీవే మఠమందు నీవే
విఠలాక్ష జగమంత నీవే కదా   " నటరాజ "

హే నాగభరణా నీ నామస్మరణా
నే మానలేదయ్యా  2
నానావిధంబుల గానంబు జేతూ
దీనావనా జాలి చూపించవా         " నటరాజ  "

కలవారలెన్నో కానుకలనిచ్చీ
కొలిచేరు ఓ దేవా 2
ఫలపత్రమైనా తేలేని నేనూ 2
పిలిచేను నా పిలుపు ఆలకించవా     " నటరాజ "

భువనేశ సకలా భూతేశ్వరా
హే భవబంధ పరిహారా 2
శివచంద్రశేఖర భవదీయదాసూ
కవి రామచంద్రుణ్ణి కాపాడవా       " నటరాజ "

నాటినావు పూదోటను నీవే - భజన

నాటినావు పూదోటను నీవే
తోటలోన ప్రతి చోటను నీవే  2

మొక్కలు కొన్ని వృక్షములాయె
వాడిన తీగలు మోడులు ఆయె
నీటితోనె ఈ తోట పెరుగగా
తోటమాలి ఈ లోటు ఎరుగడా     " నాటినావు "

పూలూ కాయలు ఊయలలూగే
గాలికి పూలు నేలకు రాలే 2
పూలు రాల పూ బాలలు నవ్వే 2
కాలగతిని వనమాలి తెలియడా    " నాటినావు "

పూవులు కొన్నీ పూజలకేగే
ప్రాప్తము లేనివీ పాడైపోయే 2
ఋణము దీరెనా ఏ జీవికైనా  2
తనువులు వదిలి తరలిపోవునులే    " నాటినావు "

చంద్రధరుని సేవించేటి
రామచంద్రుడు శ్రీ గురువాయే
వాడిన తీగై వనములనుండే
నీడ జూసి కాపాడగ రావే     " నాటినావు "

Monday, 10 September 2018

అరుణ కిరణా తిమిర హరణా - భజన

అరుణ కిరణా తిమిర హరణా
శ్రీ సూర్య నారాయణా 2

స్వప్రకాశమున విశ్వవీధిలో
వెలుగులు నింపే దేవుడవయ్యా 2
తారల తళుకులు జాబిలి వెలుగులు 2
నింగిని దోచే నీ కాంతులేగా             " అరుణ "

ప్రాత: కాలపు ప్రణతులతో
ప్రార్థించెదము భాస్కరా 2
ఆయురారోగ్యముల మము దీవించే 2
దైవము నీవని తెలిసితినీ               " అరుణ "

ఘోరాగ్ని కీలల రగిలిపోతూ
జగతికి వెలుగిచ్చు త్యాగమయా 2
జ్యోతిగ వెలిగే నీ దివ్య తేజము 2
మదిలో నిలిపీ ధ్యానింతుమూ            " అరుణ "

సాయి భవానీ సాయి భవానీ సాయి భవానీ మా - భజన

సాయి భవానీ సాయి భవానీ సాయి భవానీ మా 2
శంకరీ అభయంకరీ సాయి భవానీ మా

దుర్గాలక్ష్మీ సరస్వతీ
జై సాయి భవానీ మా
గాయత్రీ ప్రియ గౌరి మహేశ్వరి
సాయి భవానీ మా        " సాయి "

జయ కాశీ విశ్వనాథా మము కాపాడు ఓ జగన్నాథా - భజన

జయ కాశీ విశ్వనాథా మము కాపాడు ఓ జగన్నాథా 2
పరమదయాళో భోళా శంకర్ 2            " జయ "

నందివాహనా నాగాభూషణ 2
గంగాజటధరా గౌరిమనోహర  2      " జయ "

దుష్ట శిక్షణా శిష్ట రక్షణా 2
నీలకంఠాధరా నిముషము మరువరా    " జయ "

Saturday, 8 September 2018

ఎర్రా ఎర్రాని గాజులే వేసుకొని - భజన

ఎర్రా ఎర్రాని గాజులే వేసుకొని
పచ్చా పచ్చాని రైకలే కట్టుకొని
బంగారు వన్నె గల పట్టుచీర కట్టుకొని
బెజవాడ కొండ దిగి పులి మీద వచ్చిందీ
అమ్మా తల్లీ 2 3 దిగివచ్చిందీ
కనకదుర్గా కదిలొచ్చిందీ 2   ' ఎర్రా "

ఘల్లు ఘల్లు మంటు గజ్జెలే కట్టుకొని 2
ఘల్లు ఘల్లుమంటు అమ్మా దిగి వచ్చింది 2
చేతిలోన శూలముతో అమ్మ దిగివచ్చింది
బెజవాడ కొండ దిగి పులి మీద వచ్చిందీ
అమ్మా తల్లీ 2 3 దిగివచ్చిందీ
కనకదుర్గా కదిలొచ్చిందీ 2   " ఎర్రా '

ముఖమంతా పసుపుతో ఎర్రాని బొట్టుతో 2
కాళ్ళకు పారాణి రాసి ముద్దుగ మువ్వలు గట్టి  2
వేల వేల తేజస్సుతొ వేప మండలే బట్టి
బెజవాడ కొండ దిగి పులి మీద వచ్చిందీ
అమ్మా తల్లీ 2 3 దిగివచ్చిందీ
కనకదుర్గా కదిలొచ్చిందీ 2   " ఎర్రా '

Friday, 7 September 2018

నిను చూడక నేనుండగలనా - భజన

నిను చూడక నేనుండగలనా
నీ కొండకు రాకుండగలనా
ఈ దేహం నీదు ప్రసాదం
నా ప్రాణం నీ ఉపకారం 2

మనసున్నది నీ ధ్యాసలోనే
తనువున్నది నీ సేవలోనే
ప్రతి నొటా నీ శరణ గానం
నా నోటే నీ మధుర గానం 2    " నిను "

ఆ బ్రహ్మకు నే ఋణపడనా
రాత రాశాడు నిను చూడగా
కనిపించే దైవాలు తల్లిదండ్రులే
జన్మనిచ్చారు ఏనాటి వరమో 2    " నిను "

ఈ ఇహమందు ఏ దుష్ట కోరికలు
ఇక రాకుండ నువు చూడవా
ఈ జన్మంత  సేవింతునయ్యా
ఇక మరుజన్మ నాకివ్వకయ్యా 2   " నిను "

పవిత్ర ప్రదేశమైనా,పని చేసే ప్రదేశమైనా,పడక గదియైనా - కవిత

పవిత్ర ప్రదేశమైనా,పని చేసే ప్రదేశమైనా,పడక గదియైనా
పల్లెటూరైనా,పట్టణమైనా ,పరాయి దేశమైనా,ప్రాంతమేదైనా
ప్రయాణించే బస్ ఐనా,రైలూ ఐనా,విమానమైనా
కాదేదీ అనర్హం అన్నట్టు ,పల్లె పడుచు నుండి ,పట్టణపు పడతి వరకు
పసిపాప నుండి పండుటాకు వరకు పడతి పడుతోంది పలు కష్టాలు
పాపుల పాలబడి పలు ఏండ్ల నుండి పన్ను బిగబట్టి
పట్టువదలకుండా పలుమార్లు పళ్లూడిపోయేలా దాడులు చేస్తేనే
పాపుల పాపం పండుతుంది,పరిష్కారం లభించి ఫలితం కనబడుతుంది
స్త్రీ గౌరవింపబడిన చోటనే దేవతలు నివాసముంటారు అనే శాస్త్ర వాక్యం
అందరూ సదా గుర్తుంచుకోవాల్సిన ఆప్తవాక్యం
ఆడపిల్లలు అదురు బెదురు లేని బెబ్బులులై గర్జించాలి
అతివలు ఆత్మవిశ్వాసం,అధ్యాత్మిక విశ్వాసాలతో
అణచివేయాలి అక్రమార్కుల ఆగడాలు
కన్నెలు కన్నెర్ర చేసి కండకావరం పట్టిన కనికరం లేని మనుషులను
చేయాలి కనబడకుండా ,కనుచూపుమేరలో లేకుండా
అతివలు ఆత్మరక్షణ విద్యలు నేర్చి అతిక్రమించాలి అవమానాలు
పడుచులు పట్టుదలతో పోరాడి వెలుగొందాలి పట్టపురాణులై
ధైర్యే సాహసే లక్ష్మీ , ధైర్యే సాహసే రక్ష రక్ష...

Monday, 3 September 2018

అచ్యుతం కేశవం క్రిష్ణ దామోదరం - భజన

అచ్యుతం కేశవం క్రిష్ణ దామోదరం
రామ నారాయణం జానకీ వల్లభం 2

కౌను కెహతే హై భగవాను ఆతే నహీ
తుం మీరాకె జైసే బులాతే నహీ  " అచ్యు "

కౌను కెహతే హై భగవాను ఖాతే నహీ
బేరి శబరీకె జైసే ఖిలాతే నహీ     " అచ్యు "

కౌను కెహతే హై భగవాను సోతే నహీ
మా యశొదాకె జైసే సులాతే నహీ   " అచ్యు "

కౌను కెహతే హై భగవాను నాచ్తే నహీ
గోపియోంకీ తరాహ్ తుం నచాతే నహీ   " అచ్యు "

నాము జప్ తే చలో కాము కర్ తే చలో
హర్ సమయ్ క్రిష్ణ్ కా ధ్యాన్ కర్ తే చలో   " అచ్యు "

యాద్ ఆయేగి ఉన్ కో కభీ నా కభీ
క్రిష్ణ దర్శన్ తొ దేంగే కభీ నా కభీ    " అచ్యు "

దోసిట గులాబి పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా - భజన

దోసిట గులాబి పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా
సాయి బాబా నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా

కఫ్ని వస్త్రము ధరియించీ కర్మలు జోలెలొ వేసుకొనీ
ధునిలో కాల్చే వాడవనీ బాబా 2
నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా 2    " దోసిట "

తెల్లనీ నీ పాదమూ చల్లనైనా నీదు మనసూ
పిలిచిన పలికే వాడవనీ బాబా 2
నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా 2     " దోసిట "

కాలు మీదా కాలు వేసి కర్మలన్నీ కాలరాసీ
కరుణ జూపే వాడవనీ బాబా 2
నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా 2      " దోసిట "