జయము నీకు భ్రమరాంబ 2
నీకు కోటి దండాలమ్మా ఓ లలితాంబ 2 " జయము "
అమ్మలకు అమ్మవమ్మ జగత్కల్పవల్లివమ్మ 2
ముగ్గురమ్మల మూలపుటమ్మా ఓ లలితాంబ 2 " జయము "
బాసరలో వాణివమ్మ బెజవాడలొ దుర్గవమ్మ 2
కలకత్తా కాళిమాతవూ మా యమ్మ నీవు 2
ఉజ్జయినీ మహంకాళివీ మా యమ్మ నీవు 2
కామారెడ్డి లలితాంబవూ మా యమ్మ నీవు 2 " జయము "
కంచిలోన కామాక్షి మధురలోన మీనాక్షి 2
కాశీలోన విశాలాక్షివీ మా యమ్మ నీవు 2
కాశీలో అన్నపూర్ణవూ మా యమ్మ నీవు 2
కామారెడ్డి లలితాంబవూ మా యమ్మ నీవూ 2 " జయము "
రాజరాజేశ్వరివీ అంబ పరమేశ్వరివీ 2
మహిషాసుర మర్ధినివమ్మా ఓ లలితాంబ 2 " జయము "
No comments:
Post a Comment