Tuesday, 18 September 2018

అడుగడుగునా పొంచి ఉంది ప్రమాదం అతివలకు నేడు - కవిత

అడుగడుగునా పొంచి ఉంది ప్రమాదం అతివలకు నేడు
ఇంట్లో నుండే సాగించాల్సివస్తోంది పోరాటం ఇంతులకు నేడు
అబలలు కాకూడదు బేలలు ఏనాడు,కావాలి అతిబలవంతులు నేడు
ఖాళీ చేతులతోనే కామాంధుల కావరమణచగలగాలి కాంతలు నేడు
అందుకు ఆత్మ రక్షణ విద్యలు నేర్వాలి అత్యవసరంగా అతివలు నేడు
మానాభిమానాలు కాపాడుకోవాలి మార్షల్ ఆర్ట్స్ తో మహిళలు నేడు
భద్రత భరోసా పొందాలి బ్లాక్ బెల్ట్ లాంటి విద్యలతో బాలికలు నేడు
ఒడుపుగా ఒక్క గుద్దుతోనే ఓటమిని జయించగలగాలి ఒంటరి మహిళలు నేడు
కరుణ ,జాలితో పాటు కాఠిన్యం కూడా నేర్వాలి కన్నె పిల్లలు నేడు
అల్లరి వెధవలకు బుద్ధి చెప్పాలి కాళ్ళూ చేతులే ఆయుధాలుగా చేసి అమ్మాయిలు నేడు
బాక్సింగ్ ,కరాటే లాంటి విద్యలు నేర్వాలి పాఠశాల బాలికలు,సాఫ్ట్ వేర్ ఉద్యోగినులు నేడు
తైక్వాండో లాంటి తన్నుడు విద్యలు తప్పకుండా నేర్వాలి తరుణిలు నేడు
గుర్తెరగాలి పార్వతి లేనిదే శివుడికి ఏనాడు శక్తి లేదని నేడు
స్మరించుకొని సదా సత్యభామను ,ఎదుర్కోవాలి సమస్యను సమర్థంగా నేడు


No comments:

Post a Comment