పవిత్ర ప్రదేశమైనా,పని చేసే ప్రదేశమైనా,పడక గదియైనా
పల్లెటూరైనా,పట్టణమైనా ,పరాయి దేశమైనా,ప్రాంతమేదైనా
ప్రయాణించే బస్ ఐనా,రైలూ ఐనా,విమానమైనా
కాదేదీ అనర్హం అన్నట్టు ,పల్లె పడుచు నుండి ,పట్టణపు పడతి వరకు
పసిపాప నుండి పండుటాకు వరకు పడతి పడుతోంది పలు కష్టాలు
పాపుల పాలబడి పలు ఏండ్ల నుండి పన్ను బిగబట్టి
పట్టువదలకుండా పలుమార్లు పళ్లూడిపోయేలా దాడులు చేస్తేనే
పాపుల పాపం పండుతుంది,పరిష్కారం లభించి ఫలితం కనబడుతుంది
స్త్రీ గౌరవింపబడిన చోటనే దేవతలు నివాసముంటారు అనే శాస్త్ర వాక్యం
అందరూ సదా గుర్తుంచుకోవాల్సిన ఆప్తవాక్యం
ఆడపిల్లలు అదురు బెదురు లేని బెబ్బులులై గర్జించాలి
అతివలు ఆత్మవిశ్వాసం,అధ్యాత్మిక విశ్వాసాలతో
అణచివేయాలి అక్రమార్కుల ఆగడాలు
కన్నెలు కన్నెర్ర చేసి కండకావరం పట్టిన కనికరం లేని మనుషులను
చేయాలి కనబడకుండా ,కనుచూపుమేరలో లేకుండా
అతివలు ఆత్మరక్షణ విద్యలు నేర్చి అతిక్రమించాలి అవమానాలు
పడుచులు పట్టుదలతో పోరాడి వెలుగొందాలి పట్టపురాణులై
ధైర్యే సాహసే లక్ష్మీ , ధైర్యే సాహసే రక్ష రక్ష...
No comments:
Post a Comment