ఏమేమౌనో ఏమెరుక
ఎటు పోతుందో ఈ నౌక
కావాలన్నది జరిగేనా
కాగలనున్నది ఆగేనా
ఏ ఈతి బాధలు ఎదురైనా
జీవన పయనం ఆగేనా " ఏమేమౌనో "
గమనం చేసే ఈ నౌక
గమ్యం ఏదొ ఏమెరుక
ఇతరుల జూచి ఏడ్చేము
అతుకుల బ్రతుకును గడిపేము
ఇహ సౌఖ్యముకే మురిసేము
వెతలెదురైతే వగచేము " ఏమేమౌనో "
ఊహలకందని వాడొకడు ఉన్నాడా జగదీశ్వరుడూ
ఊహలు చెదిరిన రాముడితో ఆహా శివలీలన్నాడు " ఏమే "
No comments:
Post a Comment