Friday, 14 September 2018

కాలం చెల్లినది ఏదైనా ,వాహనమైనా,రహదారైనా - కవిత

కాలం చెల్లినది ఏదైనా ,వాహనమైనా,రహదారైనా
గుర్తించాలి మనకు నూకలు చెల్లిస్తుందని ఏనాటికైనా
తక్షణమే కళ్ళు తెరవాలి మనం ఇకనైనా
కాలం చెల్లిన వాటికి నూకలు చెల్లించాలి కాస్త కష్టమైనా
రెండో మాటకు తావివ్వొద్దు కలలోనైనా
లేకపొతే సమవర్తి చూపడు పక్షపాతం ,కనికరం లేశమైనా
నిర్దాక్ష్యంగా తీసేస్తాడు మన ప్రాణాలు  యే చోటనైనా, ఆలస్యం చేయకుండా నిమిషమైనా
నాణ్యత లేని వాహనాలు,రోడ్లపట్ల చర్యలు తీస్కోవాలి పట్టుదలగా ఆరునూరైనా
లేకపోతే మన ప్రాణాలు కలుస్తాయి గాలిలో యే క్షణమైనా
మన ఉదాసీన వైఖరి దారి తీయును ప్రమాదానికి యే రోజుకైనా
అసలు నూకలు చెల్లించాల్సింది దీనికేనని గుర్తించాలి ఎవరైనా
నిరంతర ప్రయత్నం జరుగుతూనే ఉండాలి జీవిత నిపుణత సాధించుటకై వీసమెత్తైనా
అపుడే నిజమైన అభివృద్ధి కలుగుతుంది నిదానంగానైనా



No comments:

Post a Comment