Monday, 10 September 2018

అరుణ కిరణా తిమిర హరణా - భజన

అరుణ కిరణా తిమిర హరణా
శ్రీ సూర్య నారాయణా 2

స్వప్రకాశమున విశ్వవీధిలో
వెలుగులు నింపే దేవుడవయ్యా 2
తారల తళుకులు జాబిలి వెలుగులు 2
నింగిని దోచే నీ కాంతులేగా             " అరుణ "

ప్రాత: కాలపు ప్రణతులతో
ప్రార్థించెదము భాస్కరా 2
ఆయురారోగ్యముల మము దీవించే 2
దైవము నీవని తెలిసితినీ               " అరుణ "

ఘోరాగ్ని కీలల రగిలిపోతూ
జగతికి వెలుగిచ్చు త్యాగమయా 2
జ్యోతిగ వెలిగే నీ దివ్య తేజము 2
మదిలో నిలిపీ ధ్యానింతుమూ            " అరుణ "

No comments:

Post a Comment