నమ్మబోకే ఓ జీవా ఇది అంతా మాయా బొమ్మలాటా 2
కొన్ని దినములకొరకూ నీకెందుకింత ఉరుకులాటా " నమ్మ "
కొత్త వస్త్రమైతెనేమీ పాత వస్త్రమైతెనేమీ
కట్టు భ్రమ తీరే దాకా ఇది కర్మ భోగ ఫలమంటా " నమ్మ "
తల్లి దండ్రులంతావూ ఇల్లూ వాకిలంటావూ
తల్లి రాదు ఇల్లు రాదూ నీవు తరలిపోయే నాడు వెంటా " నమ్మ "
అన్నదమ్ములంటావూ అక్కా చెల్లెళ్ళంటావూ
అన్న రాడు అక్కా రాదూ నీవు వెడలిపోయే నాడు వెంటా " నమ్మ "
కొడుకులున్నా బిడ్డలున్నా కోటి సంపద కలిగి యున్నా
కంటికి కన్నీరే కానీ ఎవరూ రారు నీ వెంటా " నమ్మ "
No comments:
Post a Comment