ఈ జగమేలు జనని ఓ యమ్మా
మా బ్రతుకు బాట నీవమ్మా
కరమందు వీణ దాల్చావే
కమలంబులోన వెలిచావె " ఈ జగ "
మా హృదయ కమల కుసుమం
నీ చరణాల పాదపీఠం
నీ నామ మధుర గానాలే
నిలిచేను ఇలలొ మా కొరకే " ఈ జగ "
సంగీత కళల జనని
సర్వ లోకాలు బ్రోచె వాణీ
వేదాల వెలుగు నీ చలవే
వెలిసావు ఇలలొ మా కొరకే " ఈ జగ "
కవులైన పండితులకు
తల్లి నీవేలె వారి బ్రతుకూ
ముక్కోటి దేవతా లోకం
మ్రొక్కేను ముదముతో నిత్యం " ఈ జగ "
No comments:
Post a Comment