దుర్గా మాత షెడ్డు నిర్మాణానికి భూమి పూజ
నవీపేట మండలం అబ్బాపూర్ ఎం గ్రామంలో దుర్గామాత షెడ్డు నిర్మాణానికి ఆదివారం సర్పంచ్ మనేద శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు .తన సొంత నిధులైన లక్ష రూపాయల వ్యయంతో శ్రీనివాస్ సంబంధిత షెడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నారు .ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధికి మొదటి వేతనం విరాళం
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన జక్కుల రుచిత తన మొదటి వేతనం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి విస్తరణ పనుల కోసం విరాళంగా అందించారు. వేతనానికి సంబంధించిన చెక్కును ఆదివారం వేములవాడ ఆలయ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పెరిక శ్రీనివాస్ కు అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఏఈఓ లక్ష్మణరావు ఆమె తల్లిదండ్రులు జే రవీందర్ ,మీనా తదితరులు పాల్గొన్నారు.
రూ. 50 లక్షల విలువైన భూమి విరాళం..
హన్మకొండ జిల్లా ధర్మ సాగర్ మండలం ముప్పారం గ్రామ పంచాయతీ బిల్డింగ్ ,రామాలయం నిర్మాణం కోసం గ్రామానికి చెందిన చింతలపాటి సుధీర్ రెడ్డి, చింతల పాటి సుకన్య దంపతులు రూ 50 లక్షల విలువైన 550 గజాల ఖాళీ స్థలాన్ని విరాళం గా అందచేశారు. తమ ఓపెన్ ప్లాట్ ను గ్రామ సర్పంచ్ రేణుక వెంకట్, మాజీ ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్ కు అప్పగించారు. తమ తండ్రి చింతలపాటి రామచంద్రా రెడ్డి జ్ఞాపకార్థం ఈ స్థలాన్ని గ్రామ అభివృద్ధి కోసం విరాళంగా అందచేసినట్లు తెలిపారు. దాతలను గ్రామస్తులు అభినందించారు.
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన..
తెలంగాణ గంగ తెప్పోత్సవం అంటే..
హఫీజ్ పేటలో అహింసా స్థూపం..
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ నగరంలో మియాపూర్ లో "అహింసా స్తూపం " ఆవిష్కృతమైంది. ఆదివారం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని మంజీరా పైపులైన్ రోడ్డులో అహింస స్తూపంను చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ రవికుమార్ యాదవులతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. స్థూపం రాబోయే తరాలకు శాంతి ,అహింసల దివ్య సందేశాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. స్తంభంపై లిఖించిన" పరస్పరోపగ్రహో జీవానాం " అనే సందేశం నేటి అశాంతియుత ప్రపంచంలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. మనిషి మనిషికి , జీవి జీవికి పరస్పరం సహకరించుకోవాలనే ఈ సందేశం సమాజాన్ని ఐక్యంగా నిలబెడుతుందని చెప్పారు. ఈ బృహత్తర కార్యానికి జైన్ సమాజ మహిళలు నాయకత్వం వహించడం విశేషమని, ఇది ప్రపంచానికి ఐక్యత మానవీయ సందేశాన్ని చాటి చెప్పిందని అభినందించారు. అహింస అంటే కేవలం శారీరక హాని చేయకపోవడమే కాదు మాటలలో, ప్రవర్తనలో, ఆలోచనలో కూడా దానిని పాటించడమేనని స్పష్టం చేశారు. నగర ఆర్థిక ,సామాజిక ,సంస్కృతిక ప్రగతిలో జైన్, బ్రాహ్మణ ,మహేశ్వరి వంటి వివిధ సమాజాలు కీలక భూమిక పోషించాయని కొనియాడారు.
చుక్క పూర్ లక్ష్మీ నరసింహ ఆలయ అభివృద్ధికి విరాళాలు
మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ,రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన చింతల శ్రీనివాస్ ,అరుంధతి దంపతులు జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్ కు 5000 రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా అర్చకుడు శ్రీనివాసచార్యులు దాతలకు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి సన్మానించారు.
విరాళం అందజేత..
గాంధారి మండలంలోని తిప్పారం తండాలో నూతనంగా నిర్మిస్తున్న కోదండ రామచంద్రస్వామి ఆలయానికి పోతంగల్ కలాన్ కి చెందిన కిషన్ 25 వేల రూపాయల నగదును ఆదివారం సర్పంచ్ గంగారం, ఆలయ కమిటీ చైర్మన్ బిషన్ నాయక్ లకు అందజేశారు.
ధాన్యోస్మి..
ఆలయానికి స్టాండు వితరణ..
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులోని శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి మైలారం గ్రామానికి చెందిన బొట్టే కల్పన జ్ఞాపకార్థం బొట్టేమోహన్ ఆలయ కమిటీ సభ్యులకు కొబ్బరికాయలు కొట్టే స్టాండును ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, సర్పంచ్ బాల హరిచంద్ర రెడ్డి, గ్రామస్తులు రమేష్, లింగం గౌడ్, గంగాధర్, కాశీరాం, రాములు , మహేందర్ ,రాజు పాల్గొన్నారు.