ప్రతి మంచి పని లోనూ పసుపును విరివిగా వినియోగిస్తారు మనవాళ్ళు. శుభకార్యాలలో యజ్ఞ దీక్ష సమయాలలో వస్త్రాలను పసుపు నీళ్లలో ముంచి ఆర వే య డ ము ఆచారం. తడిపి ఆరవేసిన వస్త్రాలు ఇతరులకు ఇవ్వకూడదు .నూతన వస్త్రాలు ఇవ్వాలి. పసుపు నీళ్లతో తడిపితే ఆ వస్త్రాలు పా త వైపోతాయి. అందుకే పసుపు నీళ్లలో తడిపిన ఫలం కోసం ఇతరులకు కొత్తబట్టలు పెట్టేటప్పుడు పసుపు బొట్టు పెడతారు .ఇలా చేయడం మంగళకరంగా భావిస్తారు .పసుపు క్రిమిసంహారిణి .అనేక చేతులు మారి వచ్చే కొత్త బట్టల లో ఎటువంటి క్రిములు ఉన్నా పసుపు నివారిస్తుంది. అప్పటికప్పుడు కట్టుకున్న ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఉంటుంది
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
24, మే 2021, సోమవారం
శుభకార్యం చేసిన తర్వాత దర్భలు, నువ్వులు తాకకూడదా?
దర్భలు ఎప్పుడూ పవిత్రమైనవే. దర్భను తాకకూడదు అని చెప్పే సందర్భం ఒక్కటీ లేదు. అశుచి నుంచి మనల్ని బయటపడేసేది దర్భయే. ఇంటిలో ఏదైనా పెద్ద శుభకార్యం చేసిన కొద్ది కాలానికే పెద్దలకు సంవత్సరీకాలు , త ద్ది నా లు పెట్టుకోవలసి వస్తే నువ్వులు తాకక పోవడం మాత్రం కనిపిస్తుంది .నువ్వుల కు బదులుగా వాడేవి ఏ వీ సరైన ప్రత్యామ్నాయాలు కావు . పితృకార్యం చేయవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా నువ్వుల నేఉపయోగించాలి .అందులోనూ తల్లిదండ్రులకు శ్రాద్ధకర్మలు నిర్వహించవలసి వచ్చినప్పుడు అస్సలు మానేయకూడదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)