యాదగిరిగుట్ట దేవస్థానంలో శనివారం నిత్య పూజల వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వయంభూవలను మేల్కొల్పిన అర్చకులు సువర్ణ ప్రతిష్ట మూర్తులను వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసి దళాలను అర్పించారు . ప్రాకార మంటపంలో నరసింహ హోమం, నిత్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని తిరవీధులలో ఊరేగించారు. కొండపైన అనుబంధ ఆలయం అయిన శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర ఆలయంలో ప్రతినిత్యం స్పటిక లింగ దర్శనాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఈనెల ఐదున మంగళవారం రోజున హుండీ లెక్కింపు కొండ కింద వ్రతమంటపం హాల్ నెంబర్ 2 లో జరుగుతుందని ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు. అలాగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వివిధ శాఖల నుంచి నిత్య ఆదాయంగా 40 లక్షల 25 వేల 26 రూపాయలు వచ్చినట్లు తెలిపారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి