వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల తిరుపతికి పోటెత్తతున్న భక్తుల రద్దీని టీటీడీ సమర్థంగా ఎదుర్కొంటుంది. ఒకప్పుడు శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లలో పడిగాపులు కాసిన సామాన్య భక్తులు ఇప్పుడు ఏడు ఎనిమిది గంటలలోనే స్వామిని దర్శించుకుంటున్నారు .వీఐపీ బ్రేక్, సిఫార్సులేఖల రద్దు, కమాండ్ కంట్రోల్స్ సెంటర్ ద్వారా క్యూ లైన్ ల నిరంతర పర్యవేక్షణతో టిటిడి ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. సర్వదర్శనానికి వచ్చే భక్తుల నిరీక్షణ సమయం 8 గంటల దాటకుండా అధికారులు చర్యలు చేపట్టారు .ఒక దర్శనం కోసం మరో స్లాట్ దర్శనాన్ని ఆపకుండా ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్స్ సెంటర్ ,సిసి కెమెరాలు ద్వారా ఎప్పటికప్పుడు మాడవీధులు, క్యూ కాంప్లెక్స్ లను పర్యవేక్షిస్తున్నారు. స్లాటేడ్ సర్వదర్శనం రెండు నుంచి మూడు గంటల లోపు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండున్నర గంటల లోపు పూర్తవుతుంది .శనివారం లక్ష మందికి పైగా భక్తులు వచ్చినప్పటికీ దర్శన సమయం 13 గంటలకు మించకుండా అదుపు చేయగలిగారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి