3, మే 2026, ఆదివారం

శ్రీవారి దర్శనానికి 14 గంటలు

 తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది పదవ తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడి కావడంతో పాటు వారాంతం కావడంతో తిరుమల వచ్చే భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది .శ్రీవారి ఆలయ ప్రాంతంలో పాటు మాడవీధులు, లడ్డు కేంద్రం ,అఖిల అండం, ప్రధాన కూడళ్లు ,రిసెప్షన్ కౌంటర్లు, కళ్యాణ కట్టలు రద్దీగా కనిపిస్తున్నాయి. కాలినడక మార్గాలలో రద్దీ తగ్గలేదు .వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండు లోని 31 కంపార్ట్మెంట్లు ,నారాయణ గిరిలోని తొమ్మిది షెడ్లు నిండిపోయి క్యూ లైన్ శిలా తోరణం, బాట గంగమ్మ ఆలయం మధ్య వరకు వ్యాపించింది. వీరికి దర్శనానికి దాదాపు 14 గంటల సమయం పడుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి