రుద్రూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్లో గల నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరిగాయి గురువారం ఈ వేడుకలలో మాజీ స్పీకర్ బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని ఆయన సూచించారు భక్తితోనే ముక్తి లభిస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బద్దం సంజీవరెడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్ మాజీ విండో చైర్మన్ పత్తి రాము టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలయ కమిటీ సభ్యులు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment