మహనీయులు బోధించే వివిధయోగాలను సాధనలను ఆచరించ గోరే మామూలు మనిషిని సాధారణంగా ఒక సందేహం వెనక్కు లాగుతుంది ఈరోజు ఉత్సాహంగా దీనిని ఆరంభించిన అతి చంచలమైన నా బుద్ధి దీనిని చివరి వరకు సాగనిస్తుందా తీరా ఆరంభించి మధ్యలో వదిలేస్తే అప్పటివరకు చేసినదంతా వ్యర్థమైపోతుంది కదా అని మరొక భయం కూడా ఈ మంత్ర తంత్ర ధ్యాన యోగ ఆచరణలు కొన్ని సగంలో మానేస్తే వికటించి కీడు చేసే ప్రమాదం ఉంటుందని అలా ఆచరణ లోపాల వల్ల కలిగే కీడును ప్రత్య వాయం అంటారు
ఏ ప్రత్య వాయుము లేని ఒక మార్గాన్ని భగవద్గీత చెప్తుంది అది నిష్కామ కర్మయోగం కర్మ చేయడం వరకే నాకు అధికారం దానికి ఫలానా ఫలం కలగాలని కోరి అధికారం నాకు లేదు అన్న ఎరుకతో జయాపజయాలు సాఫల్య వైఫల్యాల మీద దృష్టి లేకుండా నీ ధర్మమేదో చిత్తశుద్ధితో నువ్వు చెయ్యి ధ్యాసంతా సవ్యంగా కర్మ చేయడం మీదే ఉంచు. అప్పుడు ఆ కర్మఫలం నీకు చుట్టుకోదు దాని వలన నీకు ఎలాంటి పాపము కలగదు అన్నాడు శ్రీకృష్ణుడు గీతాలు శ్రీకృష్ణుడే నిష్కామ కర్మపరులైన వాళ్లందరికీ ఒక ముఖ్యమైన హామీ ఇచ్చాడు నా ఇహ అభిక్రమ నా సహస్తి ఈ యోగములు చేసిన కృషికి నాశనం ఉండదు అనుకున్నట్లుగా ఆచరణ తుది దాకా సాగకపోయినా ఆరంభించినప్పటి నుంచి ఆపేసే వరకు చేసిన కృషికి దానికి తగిన ఫలితం లభిస్తుంది ప్రత్య వాయహ నా విద్యతే మధ్యలో ఆపడం వలన ఈ సాధన వికటించడం కీడు చేయడం అనే ప్రమాదం లేనేలేదు అంతేకాదు ఈ ధర్మం స్వల్పంగా ఆచరించిన ఇది సంసార సాగర మహా భయం నుంచి కాపాడుతుంది కారణం ఫలం మీద దృష్టి ఉన్నవాడి బుద్ధి పరిపరి విధాల పరిగెత్తుతుంది కార్యం ఫలించదేమో ఇది సరైన మార్గము కాదు మోతాదు ఎక్కువ తక్కువలు ఉన్నాయేమో ఎంత సమయం పడుతుందో విఘ్నాలు కలుగుతాయి ఏమో సాటి వాళ్లు ఏం చేస్తున్నారు ఇలా ఎన్నెన్నో శంకర్ వేధిస్తాయి సాఫల్యం సంగతి వదిలి చేసే పని మీదే ధ ్యాస ఉంచితే బుద్ధి ఏకాగ్రంగా నిశ్చితంగా ఉంటుంది కనుక మనసు నిశ్చింతగా ఉంటుంది
No comments:
Post a Comment