Tuesday, 19 March 2024

దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపనలు

 ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటారుమూరులో శివ పంచాయతన సహిత హనుమాన్ దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవాలు ప్రారంభమయ్యాయి నాలుగు రోజులపాటు జరగనున్న ఉత్సవాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు విగ్రహాల ఊరేగింపు అనంతరం ప్రత్యేక పూజలు యజ్ఞం నిర్వహించారు బుధవారం శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ చేతుల మీదుగా శివ పంచాయత నవగ్రహ ధ్వజ శికర సహిత హనుమాన్ దేవత మూర్తులు యంత్రస్థాపన మూర్తుల ప్రతిష్టాపన వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో వీడిసి అధ్యక్షుడు ఇత్తడి గంగారెడ్డి కోశాధికారి తిరుపతి గౌడ్ ప్రధాన కార్యదర్శి గడ్డి కార్తీక్ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment