Sunday, 17 March 2024

తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించరు

 ఎన్నికల కోడ్ నేపథ్యంలో తిరుమలలో వసతి శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని టిటిడి వీఆర్వో విభాగం తెలిపింది లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు శనివారం నుంచి తిరుమలలో వసతి శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు వారి కుటుంబ సభ్యులకు నిర్దేశించిన విధి విధానాల మేరకు దర్శనం వసతి కల్పిస్తామని తెలిపింది

తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంసుందర్ శనివారం దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు



No comments:

Post a Comment