Saturday, 2 March 2024

రెండు రోజుల మేడారం హుండీల ఆదాయము ఆరు కోట్లకు పైగా

 రెండో రోజు కరెన్సీ కానుకలు రెండు కోట్ల 98 లక్షలు శుక్రవారం తెరిచిన హుండీలు 71 మొత్తం 535 లెక్కించినవి 205

మేడారం మహా జాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది రెండో రోజున శుక్రవారం నాటికి ఆదాయం 6 కోట్ల 13 లక్షల 75 వేలకు చేరింది జాతరలో దేవాదాయ శాఖ అధికారులు 535 హుండీలను ఏర్పాటు చేయగా హనుమకొండ టిటిడి కళ్యాణ మండపానికి పూర్తిగా నిండిన 518 బాక్సులు చేరాయి మిగతావి తిరుగుబాటు భక్తుల కోసం అక్కడే ఉంచారు గురువారం కౌంటింగ్ ప్రక్రియ మొదలవగా మొదటి రోజు 134 హుండీలలో మూడు కోట్ల 15 లక్షల 40000 ఇండియన్ కరెన్సీ వచ్చింది రెండో రోజున శుక్రవారం మధ్యాహ్నం నాటికి సమ్మక్క తల్లి గద్దె వద్ద ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు పూర్తయింది తర్వాత సార్లమ్మ హుండీలతో కలిపి 71 హుండీలను తెరవగా రెండు కోట్ల 98 లక్షల 35వేల రూపాయల ఆదాయం వచ్చింది మొత్తంగా రెండు రోజుల్లో ఆరు కోట్ల 13 లక్షల 75 వేల రూపాయలు వచ్చిందని అకౌంట్లో జమ చేశామని ఎండోమెంట్ ఆఫీసర్లు పేర్కొన్నారు



No comments:

Post a Comment