Thursday, 29 February 2024

కన్నుల పండుగ విగ్రహ ప్రతిష్టాపన

 లోకేశ్వరం మండలం పంచగుడి గ్రామంలో గణపతి శ్రీ వీరభద్ర సమేత భద్రకాళీ దేవి శివలింగం నంది విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పలుకుట శ్రీ మంగి రాములు మహారాజ్ వేద పండితులు యోగేష్ స్వామీల ఖర కమలములచే కన్నుల పండుగ నిర్వహించారు ఉదయం నుండి యంత్ర ప్రతిష్ట కళ్యాణం ఉత్సవం కాలన్యాసం నేత్రోన్ మలను స్వామివారి అలంకరణ సర్వదర్శనం మంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించి ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా రాములు మహారాజు మాట్లాడుతూ గణపతి వీరభద్ర సమేత శ్రీ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండాలని ప్రజల ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆశీస్సులంతా చేశారు అనంతరం భక్తుల సౌకర్యార్థం కమ్మనైన వంటకాలతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పురోహితులు విశ్వనాథ శాస్త్రి పృథ్వి స్వామి వికాస్ స్వామి నిఖిల్ స్వామి లేడీస్ పెద్దలు మహిళలు యువత యువకులు పాల్గొన్నారు



No comments:

Post a Comment