Thursday, 29 February 2024

కొమురవెల్లి ఆలయంలో విరాట్ ఫౌండేషన్ వాటర్ ప్లాంట్

 విరాట్ ఫౌండేషన్ ఫ్లై హై కన్సల్టెన్సీ సంస్థాపకులు యష్పాల్ వీరగోని ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయం వద్ద భక్తులకు చల్లని మంచినీటిని అందించేందుకుగాను నెలకొల్పిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించాలని కోరుతూ ఆ సంస్థ బాధ్యులు గురువారం సచివాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా సంస్థ డైరీ ని మంత్రికి ప్రధానం చేశారు కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకునే భక్తులకు మంచినీటిని అందించాలని గొప్ప సంకల్పంతో వాటర్ ప్లాంట్ నెలకొల్పిన విరాట్ ఫౌండేషన్ సంస్థాపకులు సభ్యులను మంత్రి అభినందించారు మంత్రిని కలిసిన వారిలో విరాట్ ఫౌండేషన్ సంస్థాపకులు యష్పాల్ వీరగోని ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఆకుల సోనియా సభ్యులు తానే సురేష్ పటేల్ తదితరులు ఉన్నారు

No comments:

Post a Comment