Sunday, 3 March 2024

జగన్మాత కరుణ

 సీతాదేవిని మహాలక్ష్మి అవతారం అంటారు ఆ మహాలక్ష్మి కరుణకు మారుపేరు ఆమె మహాలక్ష్మి అయితే రాముడు నారాయణుడు సీతారాముల గురించి మాట్లాడుతున్నప్పుడు మహాత్ములు ఆడవాళ్లు రాముడి కృప కన్నా సీతాదేవి కృపనే గొప్పగా చెప్పారు ఒకానొక కాకి అపరాధం చేసింది రాముడు వెంటనే చివరికి రాముడు వద్దకు వచ్చి తనను క్షమించమని ప్రాధేయపడింది అప్పుడు పక్కనే ఉన్న సీతాదేవి జాలిపడి దానిని విడిచిపెట్టమని కోరింది దానితో రాముడు సారైన అన్నాడు సూర్పనఖ రగడ చేసింది అయితే సీతా పక్కన ఉండడంతో రాముడు సూర్పనకు ప్రాణం తీయకుండా హెచ్చరికలతో విడిచిపెట్టాడు ఇలా సీతాదేవి పక్కన ఉన్నప్పుడు రాముడు ఎవరిని వధించలేదు సీత పక్కన లేనప్పుడు రాముడు పలువురిని వధించాడని అంటారు రావణాసురుడిని వధించిన తర్వాత ఆంజనేయుడు అశోకవనంలో సీతతో మిమ్మల్ని ఇంత కాలము ఇబ్బంది పెట్టిన ఈ అసురుల నాశనానికి ఆదేశించండి అని కోరాడు అందుకు సీతాదేవి రావణాసురుడు ఆదేశాల మేరకే వారు అలా ప్రవర్తించారు వారికి ఏ విధంగాను హాని తలపెట్టకూడదు అని చెప్పింది జగన్మాతకు తప్పించి ఇంతటి కరుణ మరి ఎవరికి ఉంటుంది అందుకే ఆమెను జగన్మాతగా భావించాలం టారు. అమ్మవారికి భూమాత అనేగా మరొక పేరు

No comments:

Post a Comment