Sunday, 3 March 2024

జాతరలలో భాషలకు అర్థాలు అనేకం

 తెలంగాణలో ఏ గ్రామం వెళ్ళిన ఎక్కడ చూసినా గ్రామదేవతలు దర్శనమిస్తారని మన దేవతలు సంప్రదాయ జాతరలకు కొదవలేదని టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య గారి చెప్పారు తెలంగాణ సాహిత్య అకాడమీ ముద్రించిన పండుగల సందర్భంగా ప్రజలు మాట్లాడే భాషకు అర్థాలు తెలిపే పదకోశాన్ని శనివారం శైలజ రామయ్య తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు ఇలాంటి అరుదైన ప్రయోగం చేసి ముద్రించిన సాహిత్య అకాడమీ ఆమె అభినందించారు ప్రజలకు ఎప్పుడు అవసరమయ్యే చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ పుస్తకం ఎంతో విలువైనన్నారు గ్రామీణ ప్రాంతాలలో జాతర సందర్భంగా పలికే మాటలు భాషను వివరించే తొలి గ్రంథమని అన్నారు ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ సంచాలకులు కేనికిల తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ బాల చారి డాక్టర్ రాపోలు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment