Sunday, 3 March 2024

ఇస్కాన్ కు తొమ్మిది ఎకరాల మామిడి తోట విరాళము

 నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం హనుమాన్ ఫారం గ్రామానికి చెందిన కొండపావులూరి శ్రీనివాసరావు సుభాషిని దంపతులు తమ తొమ్మిదిన్నర ఎకరాల మామిడి తోటను ఇస్కాన్ సంస్థకు విరాళంగా అందజేశారు ఈ తోట విలువ సుమారు మూడు కోట్ల రూపాయలు ఉంటుంది హైదరాబాదులో వ్యాపారం చేస్తున్న శ్రీనివాసరావు ఎన్నో ఏళ్లుగా శ్రీకృష్ణుడికి భక్తులు హరే కృష్ణ మూమెంట్ ఇస్కాన్ సంస్థలు సభ్యునిగాను ఉన్నారు నవీపేట మండలంలోని శాఖాపూర్ గ్రామ జీవ శివారులోని తమ మామిడి తోటను ఆదివారం ఇసుకనుకు అందజేశారు ఈ మామిడి తోటలో త్వరలో ఇస్కాన్ మందిరం వృద్ధాశ్రమం గోషాల ఏర్పాటు అవుతాయని శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు అలాగే హనుమాన్ ఫారంలో తమ సొంత డబ్బు లక్ష రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని శ్రీనివాసరావు తన తండ్రి వెంకటేశ్వరరావు పేరిట విరాళంగా ఇచ్చారు

No comments:

Post a Comment